జాతీయ

వంద నోట్లలో 70 లక్షలను తరలిస్తూ దొరికిపోయాడు: మోదీ ఎఫెక్ట్



నోట్ల రద్దుతో జనాలంతా చిల్లర కోసం నానాపాట్లు పడుతున్నారు. రూ.100 లేదా రూ.50 నోటు దొరికితే అపురూమైనదేదో చేతిలో పడ్డట్లు సంబరపడిపోతున్నారు. మొత్తంగా పెద్ద నోట్ల రద్దుతో వ‌ంద నోట్లు బంగార‌ం వాల్యూను సంతరించుకున్నాయి. ఇలాంటి కండిషన్స్ లో ఓ వ్యక్తి వద్ద లక్షల కొద్దీ వంద నోట్లు ఉంటాయని ఎవరైనా భావిస్తారా? కానీ ఢిల్లీ వాసి వద్ద మాత్రం ఇబ్బడిముబ్బడిగా వంద నోట్లు ఉన్నాయి. ఒకటీ రెండు లక్షలు కాదు ఏకంగా 70 లక్షలు విలువ చేసే వంద నోట్లు బయటపడ్డాయి.

ఢిల్లీకి చెందిన డాక్టర్ నల్లాల్ వద్ద ఇంత పెద్ద మొత్తాన్ని వందల్లో కనుగొన్న పోలీసులే అవాక్కయ్యారు. పిల్లల వైద్యుడైన నల్లాల్ ప‌హ‌ర్‌గంజ్‌ ప్రాంతంలో హడావిడిగా తన కారు డిక్కీలో నోట్ల కట్టలను సర్దుతున్నాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న పాదాచారి ఒకరు ఈ తతంగాన్ని గమనించి పోలీసులకు సమాచారమిచ్చాడు. హుటాహుటిన చేరుకున్న పోలీసులు నల్లాల్ ను అదుపులోకి తీసుకుని నోట్లు లెక్కపెట్టగా రూ.69, 86,000 ఉన్నట్లు గుర్తించారు. నోట్లన్నీ వందల్లోనే ఉండడంతో అంతా ఆశ్చర్యపోయారు.

వ్యాపార‌వేత్త అయిన మిత్రుడు ఈ నోట్లను దాయాల్సిందిగా త‌న‌ను కోరాడని, అతడి మాట కాదనలేకే డబ్బును రాజౌరీ గార్డెన్ లో ఉన్న తన ఇంటికి తీసుకెళ్తున్నానని నల్లాల్ తెలిపాడు. పోలీసులు స‌మాచారాన్ని ఇన్‌క‌మ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు అందించారు. ఐటీ శాఖ ఈ కేసుపై విచార‌ణ ప్రారంభించింది.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu