నేటి వార్తలు

అన్నింటిలో రికార్డు సృష్టించిన 2016మరాకెచ్‌: అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా 2016 రికార్డులకెక్కింది. ఈ మేరకు ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) మొరొకాన్‌ నగరంలో సోమవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింత అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. నివేదిక ప్రకారం ఈ ఏడాది సాధారణ ఉష్ణోగ్రతల కంటే 1.2 డిగ్రీల సెల్సియస్‌ మేరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది.
భారతదేశంలో రాజస్తాన్‌ లోని పలోడీలో ఈ ఏడాది మే నెలలో అత్యధికంగా 51 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు చెప్పింది. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ ముందస్తు హెచ్చరికలను గమనించి విపత్తు నిర్వహణను, వాతావరణాన్ని అంచనా వేసే విధానాలను మరింత ధృడపరుచుకోవాలని డబ్ల్యూఎంవో సూచించింది.ఈ ఏడాది వేడి గాలులు కూడా అత్యంత ఎక్కువగా వీచాయని తెలిపింది.


Comments

Facebook
నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu