సినిమాలు

ఒకే సినిమా లో 40 ముద్దులు



ఒకప్పుడు ఒక్క ముద్దు సన్నివేశానికి ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చేసే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా 40 ముద్దులున్న సినిమాకు ‘యు/ఎ’ సర్టిఫికెట్ రావడం ఆశ్చర్యమే. అంతే కాదు.. సినిమాలో ఒక్కటంటే ఒక్క ముద్దు సన్నివేశానికి కూడా కోత పడలేదు. ఇదంతా ‘బేఫికర్’ సినిమా విషయంలో చోటు చేసుకున్న చిత్రం. ప్రముఖ దర్శక నిర్మాత ఆదత్య చోప్రా రూపొందిస్తున్న ఈ సినిమా మొదట్నుంచి శృంగార సన్నివేశాలతోనే వార్తల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. నెల రోజులకు ఒక్కో రకమైన ముద్దున్న పోస్టర్ రిలీజ్ చేస్తూ.. దాదాపు పది నెలల నుంచి ఈ సినిమాను వెరైటీగా ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు ఆదిత్య చోప్రా.

ఐతే కొన్ని నెలల ముందు వరకు సెన్సార్ బోర్డు చాలా కఠినంగా ఉండేది. జేమ్స్ బాండ్ సినిమాలో ముద్దు లెంగ్త్ తగ్గించడం.. ‘ఉడ్తా పంజాబ్’ సినిమాకు 80కి పైగా కట్స్ చెప్పడం లాంటి చర్యలతో తీవ్ర దుమారం రేగడం.. సెన్సార్ బోర్డుకు కోర్టు పంచ్ ఇవ్వడం లాంటి పరిణామాలతో పరిస్థితి మారింది. ఈ మధ్య సెన్సార్ బోర్డు బాగా లిబరల్ అయిపోయింది. మున్ముందు అసలు కోతలే ఉండవని కూడా అంటున్నారు. ‘బేఫికర్’ సినిమాకు ఆ కోవలేనే కట్స్ ఏమీ ఇచ్చినట్లు లేదు. కట్స్ ఇవ్వకపోయినా.. అన్నేసి ముద్దులున్న సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ ఇవ్వడమే ఆశ్చర్యం. ఈ సినిమాలో ముద్దులతో పాటు ఇంటిమేట్ సీన్లు.. అర్ధనగ్న సన్నివేశాలు చాలానే ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. రణ్వీర్ సింగ్.. వాణికపూర్ జంటగా నటించిన ఈ చిత్రం డిసెంబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu