Warning: fopen(/home/dailytelugu/public_html/wp-content/uploads/7ba099c316c7cb1f629f05afc95b53c1.js): failed to open stream: Permission denied in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 78

Warning: fputs() expects parameter 1 to be resource, boolean given in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 79

Warning: fclose() expects parameter 1 to be resource, boolean given in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 80
అంతర్జాతీయ

41 కోట్ల ప్రజల శృంగార రహస్యాలు బయటపెట్టిన వెబ్ సైట్.



ది మందిలో ఉన్నప్పుడు పెద్దరికంగా పెద్దమనిషిగా ఉన్నప్పటికి మనసులోని చిలిపితనమంతా ప్రపంచానికి తెలిసిపోయే దురదృష్టకమైన రోజులు వచ్చేశాయి. మనసులోని శృంగార ఫీలింగ్స్ ను చుట్టూ ఉన్న సన్నిహితులకు చెప్పుకోని వారంతా.. ముక్కుముఖం తెలీని ఒక వెబ్ సైట్లో తమ సెక్స్ ముచ్చట్లను చెప్పుకున్నారు. అలా చెప్పుకున్న వారు ఏ లక్షో.. రెండు లక్షలోకాదు ఏకంగా 41 కోట్ల మందికి సంబంధించిన సమాచారం బయటకు వచ్చేసింది.

ఇంటర్నెట్ సెక్యూరిటీ లోపాల్ని బయటపెట్టే ఎథికల్ హ్యాకింగ్ గ్రూపు ఒకటి.. అడల్ట్ ఫ్రెండ్ ఫైండర్.కామ్ లో రిజిష్టర్ అయిన ఆన్ లైన్ శృంగార సంబంధాలు వెతుక్కునే వారి అకౌంట్లకు సంబంధించిన రహస్యాలు బయటకు వచ్చేశాయి. తమ సెక్స్ అలవాట్లు ఏమిటి? వారిలో ఎందరు వివాహేతర సంబంధాల్నిఇష్టపడుతున్నారు? ఎలాంటి సెక్స్ ను వారుఎంజాయ్ చేస్తారు? లాంటి ఎన్నో అంశాలకు సంబంధించిన సున్నిత సమాచారం ఈ సైట్లో ఉన్నాయి.

వీరికి సంబంధించిన ఐటీ అడ్రస్ లతో పాటు.. వారి పుట్టిన రోజులతో పాటు.. వారి వ్యక్తిగత వివరాలు సైతం తాజా హ్యాకింగ్ తో బయటకు వచ్చేశాయి. ప్రపంచంలోనే అతి పెద్ద శృంగారరహస్యాల బట్టబయలైనట్లుగా చెబుతున్న ఈ ఉదంతంలో బజార్లోకి పడిన బాధితుల సంఖ్య అక్షరాల 41 కోట్ల ఇరవై రెండు లక్షల పద్నాలుగు వేల రెండు వేల తొంభై ఐదు మంది యూజర్లకు సంబంధించిన సమాచారం బయటకు వచ్చేసింది. గతంలో ఇలాంటి ఆన్ లైన్ డేటింగ్ సంస్థలకు సంబంధించిన సమాచారం బయటకు పొక్కి ప్రపంచ వ్యాప్తంగా రచ్చ రంబోలోగా మారిపోయిన పరిస్థితి. గతంలో ఈ తరహా వెబ్ సైట్లకు సంబంధించిన సమాచారం బయటకు పొక్కినా.. తాజాగా ఉదంతం మాత్రం అంతకు మించినదన్న మాటను చెబుతున్నారు. గుట్టుగా ఉంటుందని తమకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని షేర్ చేసుకున్న కోట్లాది మంది పరిస్థితి గురించి ఆలోచిస్తేనే అయ్యో.. పాపం అనిపించట్లేదు..?


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu