గాసిప్స్

హాట్ యాంకర్ పబ్లిక్‌గా భర్తతో…బుల్లితెర యువ ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన భామ అనసూయ భరద్వాజ్. దాదాపు మూడు నాలుగేళ్ల నుంచి బుల్లితెరపై తన అందాలు ఆరబోసిన హాట్ బ్యూటీ అనసూయ.. వెండితెరపై అవకాశాలు వెతుక్కుంటూ వెళ్లింది. నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో కనిపించిన ఈ భామ మరిన్ని సినిమాల్లో నటించడానికి ప్రయత్నిస్తోంది. కాగా, అనసూయకు పెళ్లైందని, ఈ భామ భర్తతోనే కలిసి ఉంటోందనే విషయం అందరికీ తెలిసిందే. కానీ, ఆ అదృష్టవంతుడు ఎవరు అని నిత్య కుళ్లుకొని చచ్చే యువతకు మాత్రం అతగాడిని చూసే అవకాశం చాలా అరుదుగానే వచ్చింది. కానీ, ఇటీవల ఒక టీవీ కార్యక్రమానికి అనసూయ భర్త సుశాంక్ భరద్వాజ్‌తో కలిసి మరీ హాజరైంది. ఆ షోలో స్టేజ్‌పై నుంచి తన భర్తను అందరికీ పరిచయం చేసింది. పరిచయం చేయడమేకాక అతడితో కలిసి కాస్త రొమాన్స్ కూడా పండించింది. ఇద్దరూ కలిసి ఒకరికొకరు స్టేజ్‌పైనే ముద్దు పెట్టుకోవడాలు, కౌగిలించుకోవడాలు, ప్రపోజ్ చేసుకోవడం వంటి చిలిపి పనులు కూడా చేసి ఆడియన్స్‌లో వేడి పుట్టించారు. సాధారణంగా, హీరోయిన్లు, హాట్ యాంకర్లు తమకు పెళ్లి అయిందనే విషయాన్ని దాచి పెట్టి టీవీ షోలకు, ఇతర కార్యక్రమాలకు హాజరవుతుంటారు. కానీ, అనసూయ మాత్రం కాళ్లకు మెట్టెలు పెట్టుకొని మరీ హాజరై అందరికీ షాక్ ఇస్తుంటుంది. ఇప్పుడు ఏకంగా భర్తనే స్టేజ్‌పైకి తీసుకొచ్చి.. అందరికీ పెద్ద షాకే ఇచ్చింది.


Comments

Facebook
నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu