గాసిప్స్

అనుపమ పరమేశ్వరన్, శర్వానంద్ నైట్ పార్టీ లో ఏం జరిగింది



‘అ..ఆ’ చిత్రం రిలీజైన నాటి నుంచే…తెలుగు చిత్ర పరిశ్రమలో అనుపమ పరమేశ్వర్ పేరు మారుమ్రోగుతోంది. శతమానం భవతి చిత్రం హిట్‌తో ఆమె రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. కుర్ర హీరోలు ఆమె కాల్షీట్ల కోసం ఆసక్తి చూపిస్తున్నారట. దీనితో దర్శకనిర్మాతలు ఆమెను తమ చిత్రాల కథలకు హీరోయిన్ గా చెప్తున్నారు. ఈ నేపధ్యంలో అనుపమ హైదరాబాద్ సిటీ వదిలి వెళ్లడంలేదు.

అయితే ఆమె సిటీ విడిచిపెట్టకుండా ఇక్కడే అంటిపెట్టుకుని వుండటంతో తనకు బాగా పరిచయం అయిన హీరో శర్వానంద్ తో ఆమె గడుపుతోందని చెప్పుకుంటున్నారు. శతమానం భవతి హీరోతో అనుపమ రాత్రిపూట పార్టీలకు వెళుతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినపడుతున్నాయి. అయితే కేవలం సినిమా సక్సెస్ పార్టీలే అని కాకుండా అదేపనిగా ఆమె శర్వానంద్ తోనే అంటిపెట్టుకుని ఉందని టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. కాకపోతే వాళ్లద్దిరి మధ్యా ఉన్నది ఫ్రెండ్లీ రిలేషన్ కావచ్చు కదా, ఓ సినిమా సక్సెస్ అయితే ఇలాంటి రూమర్స్ రావడం సహజమేనని ఆమె సన్నిహితులు కొట్టిపారేస్తున్నారు.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu