గాసిప్స్

అనుపమ చాన్సులకోసం ఎలాంటి పనులు చేస్తుందో తెలుసా



అనుపమ పరమేశ్వరన్ పేరుకి కేరళ అమ్మాయి నే అయినా, పదహారు అణాల తెలుగు అమ్మాయి అంటే ఎవరైనా నమ్ముతారు. తన అందం తో నటనతో ఇప్పడికే తెలుగు ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంది ఈ మలయాళ కుట్టి.

రీసెంట్ గా తెలుగులో శతమానం భవతి సినిమాలో నటించి మంచి పేరే తెచ్చుకుంది ఈ భామ, ఆ సినిమా ఆడియో ఫంక్షన్ లో తీయని తెలుగు ని తన అందమైన పెదాలతో గల గలా మాట్లాడేసి అందరిని ఆశ్చర్య చకితులని చేసింది ఈ భామ.

తన అచ్చమైన తెలుగు వెనుక గల రహస్యమేంటో అని ఆరా తీస్తే తనకు తెలుగు లో మంచి ఫ్రెండ్ ఉండడం తో అది చాలా త్వరగా సాధ్యమైంది అని చెప్పింది ఈ బామ. మొదట్లో తను తెలుగు నేర్చుకోవడానికి చాలా కష్టాలే పడిందంట.. తెలుగు నేర్చుకోవడం కోసం రోజు పొద్దున్నే లేచి అన్ని తెలుగు దినపత్రికలు పదం కూడా మిస్ అవ్వకుండా చదివి అర్దాలు తెల్సుకునేదంట, ఇక తెలుగు వ్యాకరణాన్ని నేర్చుకోవడానికి నిద్రాహారాలు మానేసి మరి సినిమాలు, ఆన్లైన్ తెలుగు క్లాసులు వినేదంట ఈ మళయాళ కుట్టి. ఇంత కష్టం ఎందుకండి మీకు అంటే తెలుగు ఇండస్ట్రీ లో ఛాన్స్ అంటే మాటలు కాదండి అని చెప్తోంది ఈ అమ్మడు.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu