ఆంధ్రప్రదేశ్

హైదరాబాద్ లోనే ఏపీ అసెంబ్లీ అసలు గుట్టు విప్పిన స్పీకర్ కోడెల శివప్రసాదరావు



ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నుంచి ఏపీ రాజధాని అమరావతికి సాధ్యమైనంత తొందరగా వెళ్లిపోవాలని భావించిన ఏపీ ప్రభుత్వం… కొత్త సచివాలయం సహా అనేక శాఖలను అక్కడికి తరలించడంలో విజయం సాధించింది. అయితే ఏపీలో అసెంబ్లీ నిర్వహణ విషయంలో మాత్రం ఎందుకో ఏపీ ప్రభుత్వానికి అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. అయితే గత వర్షాకాల సమావేశాలే హైదరాబాద్ లో ఏపీ చివరి అసెంబ్లీ, మండలి సమావేశాలు అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వచ్చే శీతాకాల సమావేశాలు ఏపీలోని కొత్త అసెంబ్లీలోనే జరుగుతాయని వెల్లడించారు. అయితే ఇప్పుడు మాత్రం ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మరోసారి హైదరాబాద్ లోనే నిర్వహించే అవకాశం ఉందని స్పీకర్ కోడెల శివప్రసాదరావు చెప్పడంతో… ఏపీలో తొలి అసెంబ్లీ సమావేశాలు జరగబోయేది వచ్చే ఏడాది అని అర్థమవుతోంది.

నిజానికి నవ్యాంధ్రలోనే శీతాకాల సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నా… ఇప్పటికీ అసెంబ్లీ కార్యాలయ సిబ్బంది విభజన జరగకపోవడంతో ఈ సారి మళ్లీ హైదరాబాద్ లోనే సమావేశాలు నిర్వహించాల్సి వస్తోందని ఏపీ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికిప్పుడు ఉద్యోగుల విభజన సాధ్యంకాదు కాబట్టి… మరోసారి ఏపీ ఎమ్మెల్యేలు, మంత్రులు సమావేశాల కోసం హైదరాబాద్ రావాల్సి ఉంది. మొత్తానిక సాధ్యమైనంత తొందరగా అసెంబ్లీ సమావేశాలను ఏపీలో నిర్వహించాలని కసరత్తు చేస్తున్న స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు ఇది నిరాశ కలిగించే అంశమే.

 


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu