నేటి వార్తలు

రవితేజను ఆ ప్రాపర్టీ విషయం లో మోసం చేశా: బండ్ల గణేష్



చాన్నాళ్ల తర్వాత బండ్ల గణేష్ లైన్లోకి వచ్చాడు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా అనేక ఆసక్తికర.. సంచలన విషయాలతో కాక రేపాడు. మాస్ రాజా రవితేజను తాను ఓ పొలం విషయంలో మోసం చేసినట్లు బండ్ల గణేష్ చెప్పడం విశేషం. రవితేజ ఎంతో ఇష్టపడి తన దగ్గర పొలం కొనుక్కున్నాడని.. ఐతే ఆ పొలం విషయంలో ఆయనను మోసం చేశానని తెలిపాడు. దీని పర్యవసానాలేంటన్నది మాత్రం బండ్ల చెప్పలేదు. ‘బాద్ షా’ తర్వాత ఎన్టీఆర్ తో తనకు విభేదాలు తలెత్తిన మాట వాస్తవమే అని.. ఆ సినిమాకు నష్టం రావడమే అందుకు కారణమని బండ్ల తెలిపాడు.

పవన్ కళ్యాణ్ ఇబ్బందుల్లో ఉంటే ఆదుకున్నారు కదా అని బండ్లను అడిగితే.. ఆయనకు ఎవరూ సహాయం చేయనవసరం లేదని.. దేవుడు కూడా సాయపడాల్సిన పని లేదని.. తన సమస్యను ఆయనే పరిష్కరించుగోలడని అన్నాడు. తాను పని చేసిన వాళ్లలో ఒక దర్శకుడు రాత్రంతా మందు కొడుతూ..  డ్రగ్స్‌ తీసుకుంటూ గడుపుతాడని.. అలాంటి వ్యక్తితో పని చేయడం తన దురదృష్టమని బండ్ల సంచలన వ్యాఖ్యలు చేశాడు. సచిన్ జోషితో సినిమా చేయడం తాను చేసిన పెద్ద తప్పని చెబుతూ.. ‘‘అతడితో సినిమా చేస్తే లాభమొస్తుందా.. బండ్ల గణేష్ అంత పిచ్చోడా’’ అని వ్యాఖ్యానించడం విశేషం. సినిమా వేడుకల్లో హీరోలను అదే పనిగా పొగడ్డం గురించి స్పందిస్తూ.. ‘‘పొద్దున దేవుళ్లకు దండం పెడతాం. పొగుడుతాం. దేవుళ్ల లాంటి హీరోలను పొగిడితే తప్పేంటి’’ అని బండ్ల తనదైన శైలిలో ప్రశ్నించాడు.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu