ఆంధ్రప్రదేశ్

ఇక్కడ అన్ని కార్డ్స్ అక్సేప్టేడ్.. చాయ్ కి తప్పని కష్టాలు



పెద్ద నోట్ల రద్దు ప్రజలకు వింత అనుభవాలను రుచి చూపిస్తోంది. ఒకనాడు పేపర్ కరెన్సీ, డిజిటల్ మనీ అంటే తెలియని సామన్యులు కూడా ఇపుడు కరెన్సీ రద్దుతో చిత్రమైన అనుభవాలను ఎదుర్కొంటున్నారు, అదే సమయంలో కొత్త టెక్నాలజీకి మారిపోతున్నారు. కూరగాయల మండి, టీ దుకాణం, మటన్ షాపు ఇలా ప్రతి ఒక్కరు పాత నోట్లను స్వీకరించలేక, కొత్త నోట్లు చెలామణిలో లేకపోవడంతో వినియోగదారులు రాకపోవడంతో బిక్క చచ్చిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తమ లావాదేవీలను తిరిగి పుంజుకునేలా చేసేందుకు డిజిటల్ బాట పట్టారు. అన్ని చోట్లా స్వైపింగ్ మెషిన్లతో కస్టమర్లకు సేవలు అందిస్తున్నారు.

తాజాగా బంజారాహిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీలో ఓ టీ కొట్టు అతను స్వైపింగ్ మిషన్ ఒకటి పట్టుకొని తన ఖాతాదారులకు సేవలు అందిస్తున్నాడు. వీసా, మాస్టర్ కార్డ్స్ ఆక్సెప్టెడ్ హేర్ అంటూ బోర్డు ఒకటి తన చాయ్ బండీకి తగిలిచ్చి టీకి సరిపడా డబ్బులు తీసుకునేందుకు తన యంత్రంలో క్రెడిట్/డెబిట్ కార్డుతో స్వైప్ చేయించుకొని ఆ మొత్తాన్ని వసూలు చేసుకుంటున్నాడు. ఈ ఫొటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరోవైపు కూరగాయల మండీల్లోనూ ఇలాంటి చిత్రాలే దర్శనమిస్తున్నాయి. మావద్ద అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు అంగీకరించబడును అంటూ బోర్డులు వేలాడదీస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. ఇలా ఒకర్ని చూస్తూ ఇంకొకరు అన్నట్లుగా దాదాపుగా చిల్లర కొట్లన్నీ డిజిటల్ లావాదేవీల వైపునకు మళ్లుతున్నాయి.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu