నేటి వార్తలు

చిరు సినిమా చూసి సెన్సారోళ్లు షాక్??



మా సినిమా చూసి సెన్సార్ టీమ్ కూడా ఆశ్చర్యపోయింది… ఇలాంటి సినిమాని ఇంతవరకూ చూడలేదని మెచ్చుకుందనే డైలాగ్ని తరచుగా వింటుంటాం. సినిమా తీసిన ప్రతి ఒక్కరూ రిలీజ్ కి ముందు చెప్పే మాటే ఇది. మొదట్లో ఈ మాటల్ని సీరియస్గా తీసుకొనేవాళ్లు ప్రేక్షకులు. రానూ రానూ ఇది కూడా ఓ పబ్లిసిటీ స్టంటే అని అర్థమైపోయింది. దాంతో ఎవరు ఈ మాట చెప్పినా ప్రేక్షకులు మాత్రం లైట్ గా తీసుకొంటున్నారు. అయితే ఇండస్ట్రీ వర్గాలు మాత్రం సెన్సార్ రిపోర్టు గురించి పక్కాగా ఆరా తీస్తుంటాయి. ఏ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో అడిగి తెలుసుకొనే ప్రయత్నం చేస్తుంటాయి.  స్టార్ హీరోల సినిమాల విషయంలో అయితే ఆ ఆసక్తి మరింతగా పెరిగిపోతుంటుంది. సెన్సార్ పూర్తవ్వగానే సినిమా  అలా ఉందంట ఇలా ఉందంట అని ఇండస్ట్రీలో మాట్లాడుకోవడం మొదలుపెడుతుంటారు.

నిన్నటి నుంచి సంక్రాంతి సినిమాల  సెన్సార్ హంగామా మొదలైంది. శతమానం భవతి చిత్రానికి నిన్ననే సెన్సార్ చేశారు. ఈ రోజు చిరు సినిమా `ఖైదీ నంబర్ 150` సెన్సార్ జరిగింది. అయితే షో అయిపోయిన వెంటనే టీమ్ సభ్యులు గట్టిగా క్లాప్స్ కొట్టారనే ఓ రిపోర్ట్ బయటికి వచ్చింది. ఆ రిపోర్టులో వాస్తవం ఎంతనేది పక్కనపెడితే సెన్సార్ టీమ్ సభ్యులు మాత్రం చిరు `ఖైదీ నంబర్ 150`ని చూడటంపై అమితాసక్తిని ప్రదర్శించినట్టు తెలిసింది. ఏ సినిమాకీ లేనంతగా ఈ సినిమాని చూసేందుకు టీమ్ మొత్తం హాజరైందట. సెన్సార్ బృందంలో మొత్తం 18 మంది ఉంటారు. వాళ్లంతా కూడా చిరు సినిమాని చూడటం విశేషం అని ఫిల్మ్ నగర్ లో మాట్లాడుకొంటున్నారు.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu