ఆంధ్రప్రదేశ్

దాసరి మరణ వార్త.. శోక సముద్రం లో తెలుగు సినీ పరిశ్రమ



దాసరి నారాయణరావు నిస్సందేహం గా తెలుగు సినీ ఇండస్ట్రీ ని చాలా ఎత్తుకు దేశంలో నే ఇండస్ట్రీ కి ప్రత్వేక గుర్తింపు వచ్చేలా కృషి చేసిన నాటి తరం దర్శకుడు, ప్రొడ్యూసర్. అందుకే తెలుగు సినీ ఇండస్ట్రీ కి ఆయన పెద్ద దిక్కు అయ్యారు. దాసరి ఇండస్ట్రీ జుర్నీ లో మొత్తం గా ఒక వందమందికి పైగా దర్శక నిర్మాతలను వెండితెరకు పరిచయం చేసిన మహానుబావుడు. ఆ రోజుల్లో నేను డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను సార్ అంటూ ఎవరైనా కొత్త వ్యక్తి పెద్ద దర్శకుని దగ్గరకు వస్తే వారిని అత్యంత హేయంగా అవమానించి పంపించే రోజులు అవి. అలాంటి రోజుల్లో తనదగ్గర పని చేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్స్ ని డైరెక్టర్స్ గా వెండి తెరకు పరిచయం చేయడానికి సొంత డబ్బులతో ప్రొడక్షన్ యూనిట్ మెదలు పెట్టిన పెద్ద  మనసున్న దేవుడు ఆయన.

అలాంటి పెద్ద మనిషి వెంటిలేటర్ పై ఉన్నారు ఐసియు లో శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు, ఇక కొద్ది రోజులే అని తెలియగానే సినీ పరిశ్రమ పెద్దలందరూ ఒకరి తరువాత ఒకరు ఆకరి చూపుకి పరామర్శ అనే పేరు తో హాస్పిటల్ కి వెళ్లి ఆయనను చూసి వస్తున్నట్లు గా తెలియ వస్తోంది. ఆయన శరీరం లోని అవయవాలు పూర్తిగా దెబ్బతిన్నాయి, మూత్రపిండాల ఇన్ఫెక్షన్, ఊపిరి తిత్తుల వ్యాది తో కంప్లీట్ గా శ్వాస తీసుకోలేక భాదపడుతున్నారు.

ఆయనను ఇప్పడి వరకు సినీ పరిశ్రమ పెద్దలందరూ పరామర్శించారు. దాసరి నారాయణ రావు గారు పూర్తిగా కోలుకొని మళ్ళి సినిమాలు తీయాలని అందరం దేవున్ని ప్రార్దిద్దాం.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu