అంతర్జాతీయ

డెన్మార్క్- ప్రశాంతమైన దేశం



‘వరల్డ్ హాపీనెస్ లెవెల్స్’ సంస్థ తాజాగా విడుదల చేసిన జాబితాలో ప్రపంచంలో ప్రజలు అత్యంత సంతోషంగా జీవిస్తున్న దేశంగా డెన్మార్క్ నిలిచింది. స్విట్జర్లాండ్, ఐస్లాండ్, నార్వే, ఫిన్లాండ్లు ఆ తర్వాతి నాలుగు స్థానాల్లో నిలిచాయి. అమెరికా 13వ స్థానంలో, జర్మనీ 16వ స్థానంలో, బ్రిటన్ 23 స్థానాల్లో నిలిచాయి. జాతీయ స్థూల ఉత్పత్తిలో ప్రజల సగటు ఆదాయాన్ని, వారి ఆరోగ్య ఆయుర్దాయాన్ని, జీవితాన్ని ఎంపిక చేసుకోవడంలో ప్రజలకున్న స్వేచ్ఛను పరిగణనలోకి తీసుకొని 156 దేశాల జాబితాను రూపొందించారు.

గత ఏడాది నిర్వహించిన సర్వేలో డెన్మార్క్కు మూడో స్థానంలో నిలువగా…తాజాగా మొదటి స్థానం దక్కించుకుంది. ఈ పరిణామంపై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ప్రత్యేక సలహాదారు హర్షం వ్యక్తం చేశారు. డబ్బు వెంట పరుగెత్తుతున్న అమెరికా లాంటి దేశాలకు ఇదో సందేశమని ఆయన ఎద్దేవా చేశారు. సమాజంలో మార్పు వస్తోందని పేర్కొంటూ వివిధ నివేదికలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని అన్నారు. ప్రభుత్వాల పట్ల ప్రజలు విశ్వాసం కూడా కోల్పోతున్నారని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ప్రత్యేక సలహాదారు ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక అంశాలు, సమగ్రత, సమ్మిళిత అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆయన కోరారు.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu