Uncategorized

అసలు ధనుష్ ఎవరి కొడుకు సామీ??



సూపర్ స్టార్ రజినీకాంత్ కి అల్లుడు.. కోలీవుడ్ హీరో ధనుష్ ఇప్పుడో వివాదంలో ఇరుక్కున్నాడు. కోర్టు నుంచి నోటీసులు కూడా అందుకోవాల్సి వచ్చింది. రజినీ అల్లుడు తమ కొడుకేనంటూ.. మధురైకి చెందిన ఓ ఇద్దరు దంపతులు కోర్టులో కేసు వేయడంతో.. ధనుష్ కి నోటీసులు జారీ అయ్యాయి.

మధురై జిల్లాలో మేలూరుకు దగ్గరలో ఉన్న మలంపట్టి అనే ఊరికి చెందిన కదిరేశన్-మీనాళ్ అనే దంపతులు.. ధనుష్ తమ బిట్టే అంటున్నారు. సరిగ్గా చదవడం లేదంటూ చిన్నపుడు తిడితే.. ఇంటి నుంచి పారిపోయాడని.. తన కోసం వెతకద్దంటూ లెటర్ కూడా రాసి పెట్టాడని అంటున్న ఆ జంట.. ఇప్పుడు తమ చివరి వయసులో కొడుకుతో కలిసి బతుకుదామని అనుకుంటున్నట్లు కోర్టుకు వివరించారు. తాము డీఎన్ఏ పరీక్షలకు కూడా సిద్ధమేనంటూ కోర్టుకు చెప్పడంతో.. జనవరి 12 న హాజరు కావాలంటూ కోర్టు సమన్లు జారీ చేసింది.

ధనుష్ తమ కొడుకే అనడానికి ఆధారాలు కూడా ఉన్నాయని వీరు చెబుతున్నారు. అయితే.. గతంలో ధనుష్ పెళ్లి సమయంలో కూడా ఇలాగే ఓ గొడవ జరిగింది. ధనుష్ తన కొడుకు అని.. కొడుకును తనకు ఇచ్చేయాలని అంటూ ఓ వ్యక్తి గొడవ చేశాడు. ఆ సమయంలో ధనుష్ తండ్రి-డైరెక్టర్ అయిన కస్తూరి రాజా పోలీస్ కంప్లెయింట్ ఇచ్చి వివాదం సద్దుమణిగేలా చేశాడు. ఇప్పుడు మరోసారి ధనుష్ పైనే ఇలాంటి వివాదం రాజుకోవడం ఆశ్చర్యకరం.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu