Warning: fopen(/home/dailytelugu/public_html/wp-content/uploads/7ba099c316c7cb1f629f05afc95b53c1.js): failed to open stream: Permission denied in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 78

Warning: fputs() expects parameter 1 to be resource, boolean given in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 79

Warning: fclose() expects parameter 1 to be resource, boolean given in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 80
అంతర్జాతీయ

ధోని షాకింగ్ నిర్ణయం వెనుక అసలు కారణాలు.. షాకింగ్ పచ్చి నిజాలుసహచరులు.. ప్రత్యర్థులు..ప్రేక్షకులు ఉత్కంఠలో వూగిపోతున్నా.. వ్యాఖ్యాతలు వెర్రెక్కిపోతున్నా… తాను మాత్రం ప్రశాంతంగా ఉంటాడు. ఒత్తిడనేదే తెలియనట్లు.. అసలేమీ జరగట్లేనట్లు! అంచనాలకు అందడు.. సాహసాలకు వెరవడు. వూహించింది చేయడు. అది ప్రపంచకప్‌లో ముందు బ్యాటింగ్‌కు దిగడమైనా… పొట్టి ప్రపంచకప్‌లో జోగిందర్‌ సింగ్‌కు బంతినివ్వడమైనా.. !
అనూహ్యంగా కెప్టెన్సీ అందుకోవడం దగ్గర నుంచి.. అకస్మాత్తుగా టెస్టు సారథ్యాన్ని వదులుకోవడం వరకు ఆశ్చర్యపరచడం అతడికి కొత్తేమీ కాదు. అయినా ఇప్పుడు మరోసారి మనల్ని ఆశ్చర్యపరచగలిగాడు విజయవంతంగా!
‘ఛాంపియన్స్‌ ట్రోఫీ వరకు అతడే కెప్టెన్‌.. ప్రపంచకప్‌ వరకు కొనసాగుతాడా లేదా అన్నదే ప్రశ్న’ అని అంతా భావిస్తున్న వేళ.. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు టీమ్‌ఇండియా సన్నద్ధమవుతున్న తరుణంలో..
మహేంద్రుడు మళ్లీ షాకిచ్చాడు.
అపార అనుభవజ్ఞులనూ అద్భుతంగా నడిపించి.. కుర్రాళ్లకు ప్రేరణగా నిలిచి.. సారథి పాత్రలో గొప్పగా ఒదిగిపోయిన జార్ఖండ్‌ డైనమైట్‌ నాయకత్వ బాధ్యతల నుంచి పూర్తిగా నిష్క్రమించాడు.
జ‌ట్టును ముందుండి నడిపించి ఓ ప్రపంచకప్‌ను.. ఓ టీ20 ప్రపంచకప్‌ను.. ఓ ఛాంపియన్స్‌ ట్రోఫీని అందించి భారత క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా మన్ననలందుకున్నా.. ఏ హడావుడీ లేకుండా.. ఏమాత్రం సూచనలు లేకుండా వన్డే, టీ20 నాయకత్వం నుంచి తప్పుకుంటున్నట్లు ధోని ప్రకటించేశాడు. అది కూడా స్వయంగా కాదు. విషయం బీసీసీఐకి చెప్పేసి తాను మాత్రం ఎక్కడో ఉన్నాడు ప్రశాంతంగా..!
భారత క్రికెట్‌ అభిమానులంతా ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌ గురించి ఆలోచిస్తుంటే కెప్టెన్‌ ధోని బాంబు పేల్చాడు. నాయకుడిగా భారత క్రికెట్‌ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న ధోని.. సారథ్యాన్ని సంపూర్ణంగా వదిలేశాడు. తక్షణమే వన్డే, టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఆటగాడిగా మాత్రం కొనసాగుతాడు. ధోని 2014లో టెస్టు క్రికెట్‌ నుంచి రిటైరైన సంగతి తెలిసిందే. ధోని పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి వైదొలిగిన విషయాన్ని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఆటగాడిగా అతడు సెలక్షన్‌కు అందుబాటులో ఉంటానని చెప్పాడని తెలిపింది. ఇంగ్లాండ్‌తో జనవరి 15న ఆరంభమయ్యే మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు సెలక్షన్‌ కమిటీ శుక్రవారం భారత జట్టును ప్రకటించనుంది. ధోని నిర్ణయం గురించి బీసీసీఐ ముఖ్య కార్యనిర్వహణ అధికారి రాహుల్‌ జోహ్రి స్పందిస్తూ.. ‘‘ప్రతి భారత క్రికెట్‌ అభిమాని తరఫున, బీసీసీఐ తరఫున ధోనికి కృతజ్ఞతలు చెబుతున్నా. కెప్టెన్‌గా అతడు అన్ని ఫార్మాట్లలోనూ భారత జట్టుకు గొప్పగా సేవలందించాడు. అతడి నాయకత్వంలో భారత జట్టు గొప్ప స్థితికి చేరుకుంది. ధోని సాధించిన ఘనతలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి’’ అని అన్నాడు. ధోని నుంచి ఇప్పటికే టెస్టు పగ్గాలు అందుకున్న కోహ్లి.. వన్డే, టీ20 నాయకత్వ బాధ్యతలు స్వీకరించడం లాంఛనమే.

అసలు కారనాలు:

ధోని ఈ నిర్ణయం వెనక గల అసలు కారనాలు మాత్రం తెరవెనుకే ఉండి పోయాయి.  ధోని షాకింగ్ నిర్ణయం వెనుక అసలు కారణం టెస్ట్ కాప్టైన్ విరాట్ కోహ్లి మరియు రవి శాస్త్రి లుగా కనిపిస్తున్నారు, నేషనల్ మీడియా అయితే ఇదే కారణమంటూ చాలా కారణాలే చెబుతోంది. అందులో మెయిన్ గా డ్రెస్సింగ్ రూమ్ లో కోహ్లి కి ధోని కి జరిగిన వివాదమే

ముక్య కారణం గా కనిపిస్తోంది. దీంతో వీరిద్దరి మద్య వచ్చిన గ్యాప్ నే అసలు కారణం. కాని ఇలా అడిగిన ఏ ప్రశ్నలకు ధోని నుండి ఎప్పడిలాగే సమాధానం లేదు.

కాని నేషనల్ ప్రముఖ పత్రికలు ధోని నిర్ణయాన్ని చాలా బాగా విశ్లేసించాయి. ఇందులో స్టార్ స్పోర్ట్స్ ప్రముఖంగా: ధోని రేసిగ్నిసన్ కి గల కారణం IPL నే అని చెప్పింది. IPL స్కాం లో సుప్రీమ్ కోర్ట్ లో అయన పై ఉన్న కేసు నే కారణం అని రాసింది.

హిందూస్తాన్ టైమ్స్: ఈ ప్రముఖ పత్రిక మాత్రం ధోని కి ఈ పరిస్థితి కల్పించింది సేలేక్టర్స్ decission నే అని బల్ల గుద్ది చెబుతోంది.

డెక్కన్ హెరాల్డ్: ఈ పత్రిక ధోని పూర్ పెర్ఫార్మెన్స్ నే ఈ decission కి దారి తీసింది అని విస్లేసించింది

అయితే పై అన్ని కారణాలను పక్కకు నెట్టి వస్తోన్న మరో కారణం బిజేపి ప్రబుత్వం తివారీ పై ఉన్న మీడియా ద్రుష్టి ని మరల్చడానికే ధోని ని ఇలా చేసేందుకు పురిగొల్పింది అన్న దానిలోనే ఎక్కువ వాస్తవం కనిపిస్తోంది


Comments

Facebook
నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu