జాతీయ

దిల్ సుక్ నగర్ జంట పేలుళ్ళ కేసు లో ఐదగురి కి ఉరి శిక్షచర్లపల్లి: అత్యంత భయానకంగా 2013 లో దిల్ సుక్ నగర్ లో జరిగిన జంట పేలుళ్ళలో వందలమంది అమాయకులు గాయాల పాలయ్యారు పదుల సంక్యలో అసువులు భాసారు. ఇది హైదరాబాద్ చరిత్రలోనే అత్యంత భయానక సంగటన.  ఈ నరమేధానికి కారకులైన వారిని మన పోలీసులు చాల చాకచక్యం గా పట్టుకుని విచారించారు. మొత్తం గా పోలీసులు   ఈ కేసులో ఐదుగురు ముక్య నిందుతులకి ఉరి శిక్ష వేఇంచ గలిగారు.  ముచ్చట గా మూడు సంవత్సరాల తర్వాత వారి పాపానికి వురిశిక్షనే అంటూ NIA స్పెషల్ కోర్ట్ సంచలన తీర్పు ను ఇచ్చింది.

ఈ తీర్పు విన్న దిల్ సుక్ నగర్ ప్రజలు స్వీట్స్ పంచుకుంటూ తమ ఆనందాన్ని తెలిపారు. ఈ కేసు దశలవారిగా విచారించటం జరిగింది. ఈ మొత్తం కేసు లో పోలీసులు A1 రియాజ్ బత్కల్ ను చేర్చారు. మిగిలిన నలుగురి పేర్లను తర్వాత చేర్చటం జరిగింది. పోలీసులు వీళ్ళు బాంబులు ఇక్కడ ఇక్కడ పెట్టారు. వాటికి ఉపయోగించిన టిఫిన్బాక్స్ లను, సైకిల్ లను ఎక్కడినుంచి కొన్నారు బాంబ్ లను ఎలా అమర్చారో కోర్ట్ కు పక్కా ప్రూఫ్స్ తో అందించడం జరిగింది. మొత్తం గా NIA 512 సాక్ష్యాలను కోర్ట్ కి అందించింది, ఈ బాంబ్ పేలుళ్ళలో మొత్తం 18 మంది చనిపోగా, 180 కి పైగా క్షతగాత్రులయ్యారు. ఈ కేసు ను NIA కోర్ట్ లో మూడున్నర ఏళ్ళుగా సాగింది. కోర్ట్ కి 107 మంది వాంగ్మూలం సేకరించి సాక్షులుగా ప్రవేశపెట్టారు.

 


Comments

Facebook
నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu