ఆంధ్రప్రదేశ్

ఎవరినైనా పూర్తిగా నమ్మే ముందు ఈ సింపుల్ ట్రిక్ అప్లయ్ చేయండి!



యవ్వనంలో స్నేహం, ప్రేమ.. ఇలాంటి ఆకర్షణలెన్నో. ఎవరయినా కాస్త స్నేహంగా ప్రవర్తిస్తే నా బెస్ట్ ఫ్రెండ్ తనే అని ఫిక్స్ అయిపోతారు. అలాగే ఎవరైనా కాస్త ప్రేమగా మాట్లాడితే చాలు.. ఇక తనే నా జీవిత జీవిత భాగస్వామి అని డిసైడ్ అవుతారు. ఎందుకంటే టీనేజ్ అంటేనే అంత.. యూత్ లో ఈ మాత్రం తొందర మామూలే.. ముఖ్యంగా స్కూల్ అయిపోయి కాలేజ్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకునే తీరిక, విజ్ఞత ఉండదు. ఈ తొందరతోనే నూటికి 70 మంది యువత మోసపోతున్నారని ఇటీవల ఓ సర్వే తేల్చింది. ముఖ్యంగా ఇలా బాధితులయ్యే వారి జాబితాలే అమ్మాయిలు చాలా ఎక్కువట. యువతే కాదు కొందరు మంచితనం అనే ముసుగులో చేసే మోసాలకు వయసుతో సంబంధం లేకుండా పడిపోతుంటారు. మరి ఇలాంటి కన్ఫ్యూజన్ ని ఎలా ఫేజ్ చేయాలి? అసలు ఎవరు నిజం? ఎవరు మోసం? అని ఎలా జడ్జ్ చేయాలి? అదిగో అటువంటి వారికోసమే ఈ సింపుల్ ట్రిక్..

సంతోష సమయాల్లో మీతో ఉన్నవారు రేపు మీరు కష్ట, నష్టాలు ఎదుర్కొన్నప్పుడు మీకు తోడుగా నిలుస్తారా అనేది ఈ ట్రిక్ తో చెక్ చేసుకోవచ్చు. ఎవరితోనయినా స్నేహం ఏర్పడినప్పుడు.. ఆ వ్యక్తిని పూర్తిగా నమ్మేందుకు ఐదు నుంచి ఎనిమిది నెలలు పరీక్షించాలి. ముఖ్యంగా వారి ప్రవర్తన, నడత అన్నీ తీక్షణంగా గమనించాలి. ఓ వ్యక్తి మీతో ఎందుకు స్నేహం చేయాలనుకుంటున్నాడో తెలుసుకోవడానికి ఈ సమయం సరిపోతుంది. అలాగే మీపై ప్రేమానురాగాలు కురిపిస్తున్న వారికి అటాచ్ అయ్యేందుకు ఇంతే సమయం కేటాయిస్తే మంచిది. ఈ సమయంలో నిశితంగా గమనిస్తే ఎదుటి వ్యక్తి మీ నుంచి ఏం ఆశిస్తున్నారో ఇట్టే కనిపెట్టేయొచ్చు. నిజంగా స్నేహం/ప్రేమనే మీ నుంచి కోరుకుంటున్నాడా? లేక ఇంకేదయినా పన్నాగం ఉందా అనేది తేలిగ్గా పసిగట్టొచ్చు.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu