Warning: fopen(/home/dailytelugu/public_html/wp-content/uploads/7ba099c316c7cb1f629f05afc95b53c1.js): failed to open stream: Permission denied in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 78

Warning: fputs() expects parameter 1 to be resource, boolean given in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 79

Warning: fclose() expects parameter 1 to be resource, boolean given in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 80
రివ్యూస్

రివ్యూ: ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడాటైటిల్‌: ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా రివ్యూ
జానర్ : రొమాంటిక్ థ్రిల్లర్
న‌టీన‌టులు: నిఖిల్ సిద్ధార్థ్, నందితా శ్వేతా, హేబా పటేల్, అవికా ఘోర్‌, వెన్నెల కిశోర్
సంగీతం: శేఖర్ చంద్ర
నిర్మాత : పి.వి. రావు
దర్శకత్వం: విఐ. ఆనంద్
రిలీజ్ డేట్‌: 17 న‌వంబ‌ర్‌, 2016

స్వామిరారా, కార్తీకేయ, సూర్య వర్సెస్ సూర్య లాంటి సినిమాలతో ట్రాక్ లోకి వచ్చినట్టుగానే కనిపించిన నిఖిల్, తరువాత శంకరాభరణం సినిమాతో నిరాశపరిచాడు. ఆ సినిమా త‌ర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న నిఖిల్ మ‌రో మంచి స‌బ్జెక్టును ఎంచుకున్నాడు. విఐ.ఆనంద్ డైరెక్ష‌న్‌లో నిఖిల్ న‌టించిన ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా సినిమా ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఎక్కడికి పోతావు చిన్నవాడా ప్రేక్ష‌కుల‌ను ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుందో డెక్క‌న్‌రిపోర్ట్‌.కామ్ స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ:
ఇంజ‌నీరింగ్ స్టూడెంట్ అయిన అర్జున్ (నిఖిల్‌) త‌న ల‌వ‌ర్‌నె పెళ్లి చేసుకునేందుకు రిజిస్ట‌ర్ ఆఫీస్‌కు వెళ‌తాడు. అయితే అక్క‌డ ఎంత సేపు ఉన్నా ఆమె రాదు. దీంతో త‌న ల‌వ‌ర్‌ అయేషా తనను మోసం చేసిందని, ఇంక జీవితంలో ఎవరికోసం వెయిట్ చేయకూడ‌ద‌ని డిసైడ్ అయ్యి కేరీర్‌లో గ్రాఫిక్ డిజైన‌ర్‌గా సెటిల్ అవుతాడు. ఆ టైంలో త‌న ఫ్రెండ్ కిశోర్ (వెన్నిల కిషోర్‌) పిచ్చి పిచ్చిగా ప్ర‌వ‌ర్తిస్తుండ‌డంతో అత‌డికి వైద్యం కోసం కేరళలోని మహిషాసుర మర్థని ఆలయానికి తీసుకెళతాడు. అదే టైంలో విజ‌య‌వాడ నుంచి అక్క‌డ‌కు వైద్యం కోసం వ‌చ్చిన అమల అనే అమ్మాయి అర్జున్ కు పరిచయం అవుతుంది.

మూడు రోజుల్లోనే వీరు చాలా క్లోజ్ అవుతారు. రేపు ఉద‌యం ఆమె త‌న ప్రేమ‌ను అర్జున్‌కు చెప్పాల‌ని అనుకుంటున్న టైంలో ఆమె అక్క‌డి నుంచి మాయ‌మ‌వుతుంది. అమ‌ల కోసం విజ‌య‌వాడ వెళ్లిన అర్జున్‌కు షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. ఆమె కొన్ని ఏళ్ల క్రింద‌టే చ‌నిపోయింద‌ని తెలుసుకుంటాడు.

ఈ క్ర‌మంలోనే అర్జున్ ఓ విష‌యం తెలుస్తుంది. కేర‌ళ‌లో త‌న‌కు ప‌రిచ‌యం అయిన అమ్మాయి అస‌లు పేరు నిత్య అని తనలోకి అమల అనే అమ్మాయి ఆత్మ ప్రవేశించటంతో కేరళలో వైద్యానికి తీసుకువెళ్లారని, అక్కడే తనకు పరిచయం అయ్యిందని అర్థం అవుతుంది. ఈ టైంలోనే అర్జున్‌కు అమ‌ల నుంచి నిన్ను క‌ల‌వ‌డానికి వ‌స్తున్నాన‌ని ఫోన్ వ‌స్తుంది. అస‌లు అమ‌ల అర్జున్ వెంట ఎందుకు ప‌డుతోంది ? నిఖిల్ పెళ్లి చేసుకోవాల‌నుకున్న అయేషా ఏం అయ్యింది ? ఈ క‌థ‌కు పార్వ‌తికి లింకేంటి ? అస‌లు అమ‌ల ఆత్మ ఏమైంది ? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మే ఈ సినిమా స్టోరీ.

విశ్లేష‌ణ‌:
రొమాంటిక్ హర్రర్ థ్రిల్లర్ ‌గా తెరకెక్కిన ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీ ఫ‌స్టాఫ్ ప్ర‌తి సీన్ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. సెకండాఫ్, క్లైమాక్స్ సీన్లు సినిమాకు హైలెట్ అయ్యాయి. ”దెయ్యాలు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సేనా” అనే డైలాగ్ కు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫ‌స్టాఫ్‌లో వ‌చ్చే థ్రిల్ల‌ర్ సీన్లు ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంటాయి. సినిమాలో హ‌ర్ర‌ర్ ఎలిమెంట్స్‌తో పాటు కామెడీ, రొమాంటిక్ అన్ని చ‌క్క‌గా సెట్ అయ్యి ప్రేక్ష‌కుల‌ను క‌ట్టి ప‌డేశాయి. ప్ర‌తి ఫ్రేమ్‌లోను ద‌ర్శ‌కుడు ఆనంద్ ప్ర‌తిభ క‌న‌ప‌డుతుంది. సినిమాకు కామెడీ పెద్ద ఎస్సెట్ అయ్యింది.

న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే విభిన్న‌మైన క‌థుల ఎంచుకుంటున్న నిఖిల్ మ‌రోసారి వైవిధ్య‌మైన క‌థ‌ను ఎంచుకున్న అక్క‌డే సగం హిట్ కొట్టాడు. కాలేజ్ స్టూడెంట్‌గాను, కేరీర్‌లో సెటిల్డ్ అయిన వ్య‌క్తిగాను రెండు విభిన్న‌పాత్ర‌ల్లో రెండు డిఫ‌రెంట్ లుక్స్‌లో మెప్పించాడు. ఇక తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయిన నందితా శ్వేత మంచి నటన కనబరిచింది. ముఖ్యంగా హర్రర్ సన్నివేశాల్లో ఆమె నటన సూపర్బ్.

ఇక బోల్డ్ క్యారెక్ట‌ర్స్‌లో రెచ్చ‌గొట్టే హేబా పటేల్ అల్లరి పిల్లగా అలరించింది. ఆమెకు అల‌వాటు అయిన గ్లామ‌ర్ షోలో మెప్పించింది. అవికాఘోర్ పాత్ర సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. తెర మీద కనిపించేది కొద్దిసేపే అయినా.. తనదైన నటనతో మెప్పించింది అవికా. ఇతర పాత్రల్లో వెన్నెల కిశోర్, ప్రవీణ్, తనికెళ్ల భరణి తమ పరిది మేరకు ఆకట్టుకున్నారు.

టెక్నిక‌ల్‌గా ఎలా ఉంది…
సాంకేతికంగా చూస్తే సినిమాకు సాయి శ్రీరామ్ సినిమాటోగ్ర‌ఫీ మేజ‌ర్ హైలెట్ అయ్యింది. మ‌హిషాసుర మ‌ర్ధిని ఆల‌యంతో పాటు ఫ‌స్టాఫ్‌లో సాంగ్స్ విజువ‌ల్స్ బాగున్నాయి. శేఖ‌ర్‌చంద్ర సంగీతం, ఎడిటింగ్, నిర్మాణ విలువ‌లు కూడా వంక లేకుండా ఉన్నాయి.

ఆనంద్ డైరెక్ష‌న్ క‌ట్స్‌:
టైగ‌ర్ సినిమాతోనే ఆనంద్ ఎలాంటి ద‌మ్మున్న క‌థ‌లు తీసుకుంటాడో అర్థ‌మైంది. ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ్‌, హిందీ భాష‌ల్లో స‌క్సెస్ ఫార్ములాగా మారిన కామెడీ హర్రర్ జానర్ నే నమ్ముకున్నా.. ఎక్కడా రొటీన్ సినిమా అన్న ఫీలింగ్ కలగకుండా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సినిమాను నడిపించాడు. కథా కథనాల విషయంలో ఆనంద్ తీసుకున్న కేర్ ప్రతీ సీన్ లోనూ కనిపిస్తుంది. ఈ రొమాంటిక్ థ్రిల్ల‌ర్‌కు ఆద్యంతం ఎంటర్‌టైన్‌మెంట్‌ను జోడించి కథను చెప్పిన విధానం బాగుంది. ముఖ్యంగా సెకండాఫ్ లో కథనాన్ని నడిపిన తీరు ఆకట్టుకుంది. ఆద్యంతం కథలో ఏదో ఒక థ్రిల్ వస్తూ సినిమాపై ఆసక్తి పెరిగేలా చేసింది. సినిమాను స‌క్సెస్ చేశాడు.

ప్ల‌స్ పాయింట్స్ (+) :
– కామెడీ
– స్క్రీన్ ప్లే
– డైరెక్ష‌న్‌
– నిఖిల్ – హీరోయిన్ల న‌ట‌న‌
– ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌

మైన‌స్ పాయింట్స్ (-):
– కొన్ని సీన్ల‌లో స్లో నెరేష‌న్‌
– ఇంకా బెట‌ర్‌గా డిజైన్ చేసుకోవాల్సిన క్లైమాక్స్‌

ఫైన‌ల్‌గా….
నిఖిల్‌కు మ‌రో డీసెంట్ హిట్‌

ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా దైల్య్తెలుగు.కం రేటింగ్‌: 2.5/5 ★★★


Comments

Facebook
నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu