ఆంధ్రప్రదేశ్

గాలి పెళ్లి.. వైకాపా లొల్లిఅక్ర‌మ గ‌నుల వ్య‌వ‌హారంలో ఘ‌నుడిగా పేరుగాంచిన కర్ణాట‌క మాజీ మంత్రి గాలి జ‌నార్ద‌న్ రెడ్డి కుమార్తె బ్రాహ్మ‌ణి పెళ్లి క‌ళ్లు మిరిమిట్లు గొలిపేలా అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఈ పెళ్లికి రూ.500 -600 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చ‌యిన‌ట్టు వార్త‌లు వ‌స్తోన్న రూ.1000 కోట్లు ఖ‌ర్చ‌యిన‌ట్టు తెలుస్తోంది. ఇంత భారీ ఖ‌ర్చుతో జ‌రిగిన ఈ పెళ్లికి పెద్ద‌గా నేత‌లెవ్వ‌రూ హాజ‌రైన దాఖ‌లా క‌నిపించ‌లేదు. ఎందుకంటే… అప్ప‌టికే రెండేళ్ల‌కు పైగా జైల్లో ఉండి వ‌చ్చిన గాలి జ‌నార్ద‌న్ రెడ్డి ఇంట జ‌రుగుతున్న పెళ్లికి వెళ్లి కొత్త వివాదాల్లో ఇరుక్కోవ‌డం ఎందుక‌నుకున్నారో? ఏమో తెలియ‌దు కానీ… రాజ‌కీయ రంగానికి చెందిన పెద్ద నేత‌లెవ్వ‌రూ గాలి వారి పెళ్లి వైభోగం చూసేందుకు స‌సేమిరా అన్నారు.

ఇక బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా సైతం క‌ర్ణాట‌క బీజేపీ లీడ‌ర్ల‌కు ఫోన్లు చేసి మ‌రీ గాలి కూతురు పెళ్లికి వెళ్ల‌వ‌ద్ద‌ని ఆదేశాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. గాలికి అత్యంత స‌న్నిహితుడు అయిన వైకాపా అధినేత వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి సైతం ఈ పెళ్లికి హాజ‌రు కాలేదు. ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది. చాలా మంది రాజ‌కీయ నాయ‌కులు సైతం హాజ‌రు కాని ఈ పెళ్లిలో కొంద‌రు వైకాపా నాయ‌కులు హ‌ల్‌చ‌ల్ చేశారు.

అయితే జ‌గ‌న్ తాను ఈ పెళ్లికి హాజ‌రైతే విమ‌ర్శ‌లు వ‌స్తాయ‌ని భావించే త‌న దూత‌గా ఆయ‌న త‌న‌కు అత్యంత స‌న్నిహితుడిగానే కాకుండా పార్టీలో కీల‌క నేత‌గా ఉన్న తిరుప‌తి మాజీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డిని బెంగ‌ళూరుకు పంపార‌ట‌. క‌రుణాక‌ర్‌రెడ్డి అక్క‌డ పెళ్లిలో సంద‌డి చేశారు. ఇక గాలి పెళ్లికి వెళ్లొద్ద‌ని బీజేపీ అధిష్ఠానం జారీ చేసిన ఆదేశాల‌ను ఆ రాష్ట్ర మాజీ సీఎం, పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బీఎస్ య‌డ్యూరప్ప భేఖాతార్ చేశారు. ఆయ‌న భారీగా త‌న మిత్ర‌బృందంతో పెళ్లికి వ‌చ్చారు.

మ‌రో షాక్ ఏంటంటే గాలి పెళ్లి వైభోగానికి నిర‌స‌న‌గా కాంగ్రెస్ పార్టీ నేత‌లు నిన్న బెంగ‌ళూరులో ధ‌ర్నాకు దిగితే… ఆ పార్టీకి చెందిన ముఖ్య‌నేత‌, సిద్ద‌రామ‌య్య కేబినెట్‌లో కీల‌క నేత‌గా ఉన్న ప‌ర‌మేశ్వ‌ర‌న్ మాత్రం గాలి పెళ్లి వేడుక‌లో త‌ళుక్కున మెరిశారు.

 


Comments

Facebook
నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu