Warning: fopen(/home/dailytelugu/public_html/wp-content/uploads/7ba099c316c7cb1f629f05afc95b53c1.js): failed to open stream: Permission denied in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 78

Warning: fputs() expects parameter 1 to be resource, boolean given in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 79

Warning: fclose() expects parameter 1 to be resource, boolean given in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 80
నేటి వార్తలు

రివ్యూ: గౌతమిపుత్ర శాతకర్ణిటైటిల్‌: గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి
బ్యాన‌ర్‌: హిస్టారిక‌ల్ మూవీ
న‌టీన‌టులు:యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ‌, శ్రేయ శరన్, హేమమాలిని, కబీర్ బేడీ త‌దిత‌రులు
సినిమాటోగ్రఫీ: జ్ణానశేఖర్
మ్యూజిక్‌: చిరంతన్ భట్
ఆర్ట్‌: భూపేష్ భూపతి
పాట‌లు: సిరివెన్నెల సీతారామశాస్త్రి
డైలాగ్స్‌: సాయిమాధవ్ బుర్ర
ఫైట్స్‌: రామ్-లక్ష్మణ్
సహనిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వర్రావు
సమర్పణ: బిబో శ్రీనివాస్
నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి-జాగర్లమూడి సాయిబాబు
ద‌ర్శ‌క‌త్వం: జాగ‌ర్ల‌మూడి రాధాకృష్ణ (క్రిష్‌)
ర‌న్ టైం: 2 గంట‌ల 12 నిమిషాలు
సెన్సార్ స‌ర్టిఫికెట్‌: యూ/ఏ
రిలీజ్ డేట్‌: 12 జ‌న‌వ‌రి, 2016

తెలుగుజాతి గ‌ర్వించ‌ద‌గ్గ నాటి త‌రం న‌టుడు, న‌ట‌ర‌త్న నంద‌మూరి తార‌క రామారావు వార‌సుడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన నంద‌మూరి బాల‌కృష్ణ టాలీవుడ్ అగ్ర హీరోల‌లో ఒక‌డిగా నాలుగు ద‌శాబ్దాలుగా తెలుగు వెండితెర‌పై హీరోగా మెరుపులు మెరిపిస్తున్నాడు. తాత‌మ్మ‌క‌ల‌తో ప్రారంభ‌మైన బాల‌య్య ప్ర‌స్థానం ఆయ‌న తాజా చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణితో 100వ సినిమాకు చేరువైంది. బాల‌య్య‌ వందో సినిమా అమ‌రావ‌తి రాజ‌ధానిగా అఖండ భార‌తావ‌నిని ఏకం చేసిన శాత‌వాహ‌న యువ‌రాజు గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కింది. టాలీవుడ్‌లో గ‌మ్యం – వేదం – కృష్ణంవందే జ‌గ‌ద్గురుం – కంచె సినిమాల‌తో విభిన్న చిత్రాల ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ డిఫ‌రెంట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ హిస్టారిక‌ల్ మూవీ రిలీజ్‌కు ముందే భారీ హైప్ తెచ్చుకుంది. ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన శాత‌క‌ర్ణి ప్రేక్ష‌కుల భారీ అంచ‌నాలు ఎలా అందుకుందో డెక్క‌న్‌రిపోర్ట్‌.కామ్ స‌మీక్ష‌లో చూద్దాం.

క‌థ‌:
ప్ర‌స్తుత న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తిని రాజ‌ధానిగా చేసుకుని పాలిస్తున్న శాత‌వాహ‌న సామ్రాజ్య యువ‌రాజు గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి (యువ‌ర‌త్న బాల‌కృష్ణ‌) అఖండ భార‌తావ‌నిని ఒకేతాటి మీద‌కు తేవాల‌నుకుంటాడు. ఈ క్ర‌మంలోనే ముందుగా క‌ళ్యాణ‌దుర్గం రాజును జయిస్తాడు. వ‌రుస‌గా 29 యుద్ధాలు చేసి ఆ రాజ్యాల‌ను జ‌యించి…వారిని త‌న సామంతులుగా చేసుకుంటాడు. ఈ క్ర‌మంలోనే ద‌క్షిణ‌భార‌త‌దేశంలో పెద్ద రాజు అయిన సౌరాష్ట్ర న‌హ‌పాలుడిని ఓడించి భార‌త్‌ను ఏకం చేయాల‌నుకుంటాడు. ఈ భారీ యుద్ధంలో శాత‌క‌ర్ణి న‌హ‌పాలుడిని ఓడించి అత‌డి అల్లుడు అయిన వృష‌భ‌నాథుడిని అక్క‌డ త‌న సామంతుడిగా చేసుకుంటాడు. భార‌తేశాన్ని గ‌తంలో పాలించిన ఎందరో గొప్ప రాజులు అయిన అశోకుడు, చంద్ర‌గుప్తుడు చేయ‌లేని ప‌నిని శాత‌క‌ర్ణి చేస్తాడు.

ఇక గ్రీకువీరుడైన అలెగ్జాండ‌ర్ టైం నుంచి భార‌త‌దేశం మీద దాడులు చేస్తున్న యువ‌నులు (గ్రీకులు) డెమిట్రియ‌స్ ఆధ్వ‌ర్యంలో భార‌త్‌మీద దండెత్తేందుకు ఎదురు చూస్తుంటారు. భార‌త్‌ను హ‌స్త‌గ‌తం చేసుకునేందుకు డెమిట్రియ‌స్ ఆధ్వ‌ర్యంలో వ‌చ్చిన గ్రీకుల‌ను చిత్తుచిత్తుగా ఓడించి భార‌త‌జాతి ఖ్యాతిని చివ‌ర‌కు ద‌శ‌దిశ‌లా శాత‌క‌ర్ణి ఎలా వ్యాపింప‌జేశాడు ? త‌న జీవిత ప్ర‌యాణంలో త‌న త‌ల్లి గౌత‌మి(హేమ‌మాలిని), భార్య వశిష్టి దేవి (శ్రియా), త‌న పిల్ల‌ల‌తో అత‌డు ఎదుర్కొన్న ప‌రిస్థితులు ఏంటి అన్న‌దే ఈ సినిమా స్టోరీ.

విశ్లేష‌ణ‌:
ఈ సినిమాలో క్రిష్ శాత‌క‌ర్ణి ముందుగా భార‌త్‌ను ఏకం చేసి, త‌ర్వాత గ్రీకుల‌ను ఎలా ఎదుర్కొన్నాడ‌న్న అంశాన్ని చెప్పాల‌నుకున్నాడు. సినిమా స్టార్టింగే క‌ళ్యాణ్‌దుర్గం మీద యుద్ధంతో స్టార్ట్ అవుతుంది. ఆ త‌ర్వాత మ‌రో గ‌ట్టి రాజ్య‌మైన సౌరాష్ట్ర మీద దండెత్త‌డంతో రెండో యుద్ధం చేసి, ఇండియాను ఏకం చేస్తాడు. చివ‌ర్లో గ్రీకుల యుద్ధం జ‌రుగుతుంది. భార‌త్ ఏక‌మ‌వ్వ‌డంతో పాటు మ‌న దేశానికి విదేశీ రాజ్యాల నుంచి ముప్పు త‌ప్పుతుంది. ఇదే క‌థ‌ను తాను ఎలా అయితే అనుకున్నాడో తెర‌మీద అంత‌కుమించి ప్ర‌జెంట్ చేశాడు. ఎక్క‌డ క‌థ ట్రాక్ త‌ప్పుకుండా, అన‌వ‌స‌ర విశ్లేష‌ణ‌ల‌కు పోకుండా సినిమాను విజ‌య‌వంతంగా ముగించాడు.

శాత‌క‌ర్ణి రాజుగా అత‌డి ప్ర‌స్థానం ఎలా ప్రారంభ‌మైంది అన్న దానికంటే కేవ‌లం క్రిష్ దేశాన్ని అత‌డు ఏకం చేసే అంశంమీదే ఎక్కువుగా కాన్‌సంట్రేష‌న్ చేశాడు. అత‌డి వ్య‌క్తిగ‌త జీవితంలో త‌ల్లికి-అత‌డికి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు చాలా త‌క్కువుగా రాసుకున్నాడు. ఇక భార్యకు అత‌డికి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు త‌క్కువే అయినా అవి నీట్‌గా ఉన్నాయి. బాల‌య్య‌-శ్రేయ మ‌ధ్య ప్రేమ‌-అప్యాయ‌త‌-అనురాగం-ఆందోళ‌న‌-శృంగారం ఇలా అన్ని అంశాల‌ను ఆవిష్క‌రించాడు. ఇక రాజ‌సుయాగం చేసిన‌ప్పుడు బాల‌య్య స్త్రీ గురించి చెప్పిన డైలాగులు వ‌ర్ణించ‌లేం. యుద్ధ‌భూమికి బాల‌య్య త‌న చిన్న కుమారుడిని కూడా తీసుకెళ్లి చేసే సాహ‌సం కూడా బాగుంది. అక్క‌డ బాల‌య్య కొడుకు పులోమావి న‌హ‌పాలుడి క‌ళ్ల‌ల్లోకి ఎలాంటి భ‌యం లేకుండా చూసే సీన్ చాలా హైలెట్‌. చివ‌ర‌కు గ్రీకుల వార్ త‌ర్వాత మ‌న జాతి గొప్ప‌త‌నం గురించిన ఓ మంచి సందేశంతో సినిమాను ముగించాడు.

న‌టీన‌టులు పెర్పామెన్స్‌:
బాల‌య్య ఆరుప‌దుల వ‌య‌స్సుకు ద‌గ్గ‌ర‌వుతున్నా కూడా శాత‌క‌ర్ణి సినిమాలో అత‌డి న‌ట‌న చూస్తే బాల‌య్య‌లో ఎనర్జీ రోజు రోజుకు పెరుగుతంద‌నిపించింది. శాత‌క‌ర్ణిగా అత‌డి న‌ట‌న త‌న తండ్రి ఎన్టీఆర్ పౌరాణిక సినిమాల‌ను గుర్తు చేసింది. బాల‌య్య యుద్ధ సన్నివేశాల్లోను, డైలాగులు చెప్ప‌డంలోను, ఇలాంటి సినిమాలు చేయ‌డంలోను మ‌రోసారి త‌న‌కు తిరుగులేదు అనిపించుకున్నాడు. దాన‌వీరశూర క‌ర్ణ సినిమాలో అభిమ‌న్యుడిగా ఆ వ‌య‌స్సులో ఎలా యుద్ధం చేశాడో..ఇప్పుడు ఈ వ‌య‌స్సులో కూడా అదే ఎన‌ర్జీ..ఇంకా చెప్పాలంటే అంత‌కుమించిన ఎనర్జీతో యుద్ధ స‌న్నివేశాల్లో న‌టించాడు.

ఇక బాల‌య్య భార్య వ‌శిష్టి దేవిగా శ్రేయ, బాల‌య్య‌కు త‌ల్లిగా మ‌హారాణి గౌత‌మిగా బాలీవుడ్ డ్రీమ్‌గ‌ర్ల్ హేమ‌మాలిని సినిమాకు వ‌న్నె తెచ్చారు. యుద్ధం ధ‌ర్మ అనే ధీటైన పాత్ర‌లో హేమ‌మాలిని న‌టిస్తే, య‌ద్ధం వ‌ద్దు భ‌ర్త శ్రేయ‌స్సే ముఖ్యం అనుకునే రోల్‌లో శ్రేయ న‌టించింది. ఇక ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లిగా, అటు మ‌హారాజు భార్య‌గా శ్రేయ ఆ పాత్ర‌కు నూటికి నూరుశాతం న్యాయం చేసింది. మిగిలిన న‌టుల్లో బాల‌య్య రాజ్యంలో సైనిక సామ్రాజ్యంలో శివ‌కృష్ణ‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, దూత‌గా శుభ‌లేఖ సుధాక‌ర్‌, ఇక గ్రీకు మ‌నుష్యులుగా డెమిట్రియ‌స్‌, ఎథినా రోల్‌లో చేసిన వారుగా త‌మ పాత్ర‌ల‌కు బాగా సెట్ అయ్యారు. టీడీపీ ఎమ్మెల్సీ యామినీబాల శ్రేయ‌కు వార్నింగ్ ఇచ్చే సీన్‌లో త‌ళుక్కుమ‌న్నారు.

టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ ఎన‌లైజింగ్‌:
ఈ సినిమాలో టెక్నిక‌ల్ విభాగాల‌న్ని క‌లిపి ఒకే గాటాన చెప్ప‌డం స‌రికాదు. అంత అద్భుతంగా టెక్నిక‌ల్ విభాగాలు ప‌నిచేశాయి.

సినిమాటోగ్ర‌ఫీ:
జ్ఞాన‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ గురించి ఎంత చెప్పుకున్నా…ఏమ‌ని చెప్పుకున్నా త‌క్కువే…న‌టీన‌టుల‌ను అందంగా, సీన్‌కు త‌గ్గ‌ట్టుగా క్లోజ‌ప్‌, లాంగ్ షార్ట్‌ల‌లో చూపించ‌డంలోను, యుద్ధ స‌న్నివేశాలు, సాంగ్స్, నిర్మాత‌లు పెట్టిన ప్ర‌తి రూపాయి తెర‌మీద చ‌క్క‌గా ఆవిష్కృతం అవ్వ‌డంలో సూప‌ర్ స‌క్సెస్ అయ్యాడు.

ఆర్ట్‌:
భూపేష్ భూప‌తి ఆర్ట్ వ‌ర్క్‌ను వ‌ర్ణించ‌డానికి మాట‌లు చాల‌వు. శాత‌వాహ‌న సామ్రాజ్యం, క‌ళ‌లు, శిల్పాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక‌టేమిటి సినిమాలో అన్ని సీన్ల‌లోను ఓ వైపు సీన్ల‌ను చూస్తూనే మ‌రోవైపు ఆర్ట్ వ‌ర్క్‌ను సైతం మిస్ కాకూడ‌ద‌నేంత అద్భుతంగా ఉంది. సాంగ్స్‌, సీన్లు, శాత‌క‌ర్ణి జీవిత చ‌రిత్ర‌ను వివ‌రిస్తూ శివ‌రాజ్‌కుమార్ చేసే సాంగ్‌లో ఇలా చెప్పుకుంటూ పోతే ఆర్ట్ వ‌ర్క్‌ను వ‌ర్ణించ‌లేం.

మ్యూజిక్‌:
చిరంత‌న్ భ‌ట్ మ్యూజిక్ మెస్మ‌రైజ్ చేసింది. పాట‌ల‌తో పాటు ఆర్ ఆర్ ప్ర‌తీసీన్‌ను ఎలివేట్ చేసింది. సినిమాలో బాల‌య్య డైలాగ్స్ చెప్పేట‌ప్పుడు, యుద్ధ స‌న్నివేశాలు, శ్రీయ‌-బాల‌య్య మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాల్లో సీన్ల‌కు త‌గిన‌ట్టుగా ప్రేక్ష‌కుడిని సినిమాలో ఇన్వాల్ చేయ‌డంలో ఓ రేంజ్‌లో విజృంభించాడు. పాట‌ల కంటే సీన్లు, వార్ స‌న్నివేశాల్లో ఆర్ ఆర్ అదిరిపోయింది.

ఫైట్స్‌:
శాత‌క‌ర్ణిలో ఉన్న నాలుగు వార్ సన్నివేశాలే సినిమాకు హార్ట్‌. తొలి యుద్దం – న‌హ‌పాలుడు యుద్ధం-గ్రీకుల యుద్ధం అన్నీ సినిమాకు ఎక్క‌డికో తీసుకెళ్లాయి. న‌హ‌పాలుడుతో స‌ముద్రంలో చేసే యుద్ధం, న‌హ‌పాలుడు కోట‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు బాల‌య్య చేసిన విన్యాసం, చివర్లో గ్రీకుల‌తో బ్లూ మ్యాట్ మీద చేసిన భారీ యుద్ధం ఇలా ఈ యుద్ధాన్ని తీసుకున్నా మైండ్ బ్లోయింగ్ చేసేశాయి. రామ్‌-లక్ష్మ‌ణ్‌ల‌కు హ్యాట్సాఫ్‌.

డైలాగ్స్‌:
శాత‌క‌ర్ణి డైలాగ్స్ చెప్పాలంటే అద్భుతం-అత్య‌ద్భుతం ఇంకా ఏమైనా ఉంటే అదే అనుకోవాలి. బుర్రా సాయిమాధ‌వ్ రాసిన ప్ర‌తి డైలాగ్ త‌న‌లోని అత్య‌ద్భుత ప్ర‌తిభ‌కు తార్కాణంగా నిలిచాయి. వాటిని తెర‌మీద బాల‌య్య చెపుతుంటే విజిల్ వేయ‌ని ప్రేక్ష‌కుడు లేడు.
– మ‌నం క‌థ‌లు చెప్ప కూడ‌దు…మ‌న క‌థ‌లు జ‌నం చెప్పుకోవాలి
– శ‌ర‌ణం అంటే ర‌క్ష‌…ర‌ణం అంటే మ‌ర‌ణ‌శిక్ష ఏదీ కావాలి
– ఇప్పటికి ఉనికిని నిలుపుకున్నాం… ఇక ఉనికిని చాటుదాం
– నేను బొట్టు పెట్టింది నా భ‌ర్త‌కు కాదు…. ఓ చ‌రిత్ర‌కు
– ఆడ‌దాని క‌డుపులో న‌లిగి న‌లిగి వెలుగు చూసిన ర‌క్త‌పు ముద్ద‌వి
– శాత‌క‌ర్ణి ఒక్క‌డు మిగిలి ఉంటే చాలు… మ‌న‌లో ఒక్క‌డు కూడా మిగ‌ల‌డు
– నా రాజ్యంలో పాలించ‌డానికి కాదు…యాచించ‌డానికి కూడా అనుమ‌తించ‌ను
– మ‌మ‌కారం..అహాంకారం రెండూ లేనివాడే నాయ‌కుడు అవుతాడు
– మ‌గ‌నాలికి గాజులు అందం…మ‌గాడికి గాయాలు అందం
– మారావు అనుకున్నా…గెలిచిన రాజ్యాలు మార్చ‌లేదు…వ‌ల‌చిన ఇల్లాలు మార్చ‌లేదు
ఇవి బుర్రా సాయిమాధ్ ఆణిముత్యం లాంటి డైలాగుల్లో కొన్ని..ఇంకా చెప్పాలంటే ఇంత‌కు మించిన డైలాగులు సినిమాలో చాలానే ఉన్నాయి.

మిగిలిన విభాగాల్లో ఎడిటింగ్ కూడా సినిమాలో ఏ సీన్ క‌ట్ చేయ‌డానికి, తీసిప‌డేయానికి వీలులేనంత క్రిస్పీగా ఉంది. సినిమా ఎక్క‌డా బోర్ కొట్ట‌లేదంటే ఎడిటింగ్ గ్రిప్పింగ్ అర్థ‌మ‌వుతోంది. ఇక ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ వై.రాజీవ్ రెడ్డి-జాగర్లమూడి సాయిబాబు నిర్మాణ విలువ‌లు ఎక్స్‌లెంట్‌. ప్ర‌తి ఫ్రేములోను వారు పెట్టిన భారీ ఖ‌ర్చు క‌న‌ప‌డింది.

క్రిష్ డైరెక్ష‌న్ క‌ట్స్‌:
ఇప్ప‌టి వ‌ర‌కు క్రిష్ తీసిన సినిమాల‌న్నీ ఒక ఎత్తు…శాత‌క‌ర్ణి మ‌రో ఎత్తు. శాత‌క‌ర్ణి క్రిష్‌ను టాలీవుడ్ గ్రేటెస్ట్ ద‌ర్శ‌కుల జాబితాలో టాప్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌డిగా నిల‌బెట్ట‌డంతో పాటు ఈ సినిమా గ‌తంలో తీసిన చారిత్ర‌క సినిమాల స‌ర‌స‌న తెలుగు సినిమా చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచిపోనుంది. శాత‌వాహ‌న చ‌క్ర‌వ‌ర్తి తాను ఏదైతే చెప్పాల‌నుకున్నాడో దానిని సుత్తి లేకుండా, సూటిగా త‌క్కువ టైం (2.15 గంట‌లు) లో అంద‌రికి అర్థ‌మ‌య్యేలా చెప్పాడు. ఈ హిస్టారిక‌ల్ స్టోరీలో కొంత‌వ‌ర‌కు సినిమాటిక్ లిబ‌ర్టీ తీసుకున్నా క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ కోసం మెయిన్ ట్రాక్ త‌ప్పకుండా స‌క్సెస్ చేయ‌డంలో క్రిష్ గొప్ప‌త‌నం క‌న‌ప‌డింది. క‌థ‌, హైలెవ‌ల్ టేకింగ్‌, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, డైరెక్ష‌న్ అన్ని తిరుగులేకుడా డీల్ చేశాడు.

ఫ్ల‌స్ పాయింట్స్ (+):
– బాల‌య్య చేసిన విరోచిత యుద్ధ విన్యాసాలు, డైలాగ్స్‌, న‌ట విశ్వ‌రూపం
– స్టోరీ-స్క్రీన్ ప్లే – క్రిష్ మైండ్ బ్లోయింగ్ డైరెక్ష‌న్‌
– ఆర్ట్ వ‌ర్క్‌
– యుద్ధ స‌న్నివేశాలు
– మ్యూజిక్‌
– నిర్మాణ విలువ‌లు
– సినిమాటోగ్ర‌ఫీ
– ఎడిటింగ్‌..అన్ని సాంకేతిక విభాగాలు

మైన‌స్ పాయింట్స్ (-):
– కొన్ని చోట్ల క్వాలిటీ త‌గ్గిన విజువ‌ల్స్‌
– శాత‌క‌ర్ణిని కేవ‌లం యుద్ధ‌కోణంలో చూపించ‌డం
– క‌థ‌ను డామినేట్ చేసిన యుద్ధం స‌న్నివేశాలు

ఫైన‌ల్‌గా….
తెలుగు సినిమా చ‌రిత్ర‌లో చిర‌కాలం నిలిచే పోయే శాత‌క‌ర్ణి
తెలుగు జాతి ఖ్యాతిని ద‌శ‌దిశ‌లా చాటి చెప్పిన శాత‌క‌ర్ణి
ప్ర‌తి తెలుగువాడు త‌ప్ప‌నిస‌రిగా చూడాల్సిన శాత‌క‌ర్ణి

గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి డెక్క‌న్‌రిపోర్ట్‌.కామ్ రేటింగ్‌: 3.75/5


Comments

Facebook
నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu