గాసిప్స్

హీరో ఆఫ్ ద ఇయర్ ఎవరు?2016 ముగిసిపోతోంది. ఏడాది ఆఖర్లో సినిమాల అవలోకనం మామూలే. మనది హీరోల చుట్టూ తిరిగే ఇండస్ట్రీ. కాబట్టి అందరి దృష్టీ ‘హీరో ఆఫ్ ద ఇయర్’ ఎవరన్న దానిపైనే ఉంటుంది. ఈ ఏడాది ఈ స్థానానికి ముగ్గురు హీరోల నుంచి ప్రధానంగా పోటీ ఉంది. అందులో ముందు చెప్పుకోవాల్సింది జూనియర్ ఎన్టీఆర్ గురించే. రొటీన్ మాస్ మసాలా సినిమాలతో గత కొన్నేళ్లలో బాగా వెనుకబడిపోయిన జూనియర్ ఎన్టీఆర్.. గత ఏడాది ‘టెంపర్’తో ఎట్టకేలకు ఒక సక్సెస్ కొట్టాడు. ఆ సక్సెస్‌ను నిలబెట్టుకుంటూ ఈ ఏడాది మరపురాని విజయాల్ని అందుకున్నాడు తారక్. ఏడాది ఆరంభంలో వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’ ఎన్టీఆర్ కెరీర్లో ఒక మైలురాయి. ఎన్టీఆర్ కెరీర్లో అత్యంత వైవిధ్యమైన సినిమా ఇది. పెర్ఫామెన్స్ పరంగానూ అతడికి ప్రత్యేకమైన సినిమా. వసూళ్లు కూడా బాగానే వచ్చాయి. ఇక ద్వితీయార్ధంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ ఎన్టీఆర్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టయింది. డివైడ్ టాక్ తో మొదలైనప్పటికీ ఈ సినిమా రూ.85 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేసి బాహుబలి..శ్రీమంతుడు తర్వాత బిగ్గెస్ట్ హిట్ అనిపించుకుంది. మొత్తంగా ఈ ఏడాది ఎన్టీఆర్ స్థాయి ఎంతో పెరిగింది.

ఇక లేటు వయసులో ‘సోగ్గాడే చిన్నినాయనా’ లాంటి బ్లాక్ బస్టర్‌తో యువ హీరోలకు సవాలు విసిరాడు నాగార్జున. ఈ సినిమా విజయ ప్రస్థానం ఒక చరిత్రే. విపరీతమైన పోటీ మధ్య.. పెద్దగా అంచనాల్లేకుండా రిలీజైన ఈ చిత్రం అనూహ్యమైన వసూళ్లతో అదరగొట్టింది. అలాంటి ఎంటర్టైనర్లో నటించిన నాగ్.. ఆ తర్వాత ‘ఊపిరి’లో సాహసోపేత పాత్రలో నటించి మెప్పించాడు. మరో విజయాన్నందుకున్నాడు. ఇక ఒక హీరో ఏడాదిలో మూడు సినిమాలు రిలీజ్ చేయడమే గొప్ప అంటే.. ఆ మూడు సినిమాలతోనూ హిట్లు కూడా కొట్టాడు నాని. ఈ ఏడాది అతడి నుంచి కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిల్మన్, మజ్ను సినిమాలు వచ్చాయి. ఈ మూడూ వేటికవే భిన్నం. ఈ మూడు సినిమాలూ ప్రేక్షకుల్ని అలరించాయి. హిట్ సినిమాలయ్యాయి. ఈ సినిమాలకు నాని పెర్ఫామెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అతను లేకుంటే ఈ సినిమాలు ఆ స్థాయిలో ఆడేవి కాదంటే అతిశయోక్తి కాదు. ఐతే సినిమాల స్థాయి.. సక్సెస్ రేట్.. పెర్ఫామెన్స్.. అన్ని కోణాల్లో చూస్తే ఈ ఏడాదికి ఎన్టీఆరే ‘హీరో’ అని అంగీకరించాల్సిందే.


Comments

Facebook
నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu