నేటి వార్తలు

మహేష్ బాబు కి సమన్లు జారి చేసిన నాంపల్లి హై కోర్ట్



మహేష్ బాబు హీరో గా కొరటాల శివ డైరెక్ట్ చేసిన శ్రీమంతుడు సినిమా కలెక్షన్స్ పరంగా తన మార్క్ ను క్రియేట్ చేసింది. ఇలా సక్సెస్ సాదించిన ఈ సినిమాకి కూడా కష్టాలు తప్పేలా లేవు. శ్రీమంతుడు సినిమాకి పనిచేసిన దర్శక నిర్మాతలకు హీరోకి నాంపల్లి హై కోర్ట్ సమన్లు జారి చేసింది.

అసలు సంగతిలోకి వెళ్తే శ్రీమంతుడు సినిమా స్టొరీ తాను రచించిన ప్రేమ నవలను ఆదారంగా చేసుకొని సినిమా తీసారని రచయిత శరత్ చంద్ర నాంపల్లి హై కోర్ట్ ని ఆశ్రయించారు కాగా 2012 లో ఒక వార పత్రికలో తను రాసిన సీరియల్ నే కాపీ కొట్టి సినిమా గా తీసారని రచయిత ఆరోపించారు.

తానూ రాసిన చచ్చేంత ప్రేమ సిరీస్ లో కాపీ చేసారని తనకు న్యాయం చేయాలని ఆయన కోర్ట్ ని కోరారు. రచయిత చేసిన పిర్యదుని దృష్టిలో పెట్టుకుని కోర్ట్ దర్శక రచయితలకు కోర్ట్ కి హాజరావ్వాల్సిందిగా ఆదేశించింది. రచయిత చేసిన ప్రైవేటు పిర్యాదు తో ఈ ముగ్గురు పై ఐపిసి 120 బి కాపీరైట్ ఆక్ట్ లోని సెక్షన్స్ 63 కింద కేసు నమోదు చేసి శ్రీమంతుడు అండ్ కో లను కోర్ట్ కి హాజరు కావాలని కోరింది.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu