జాతీయ

వంగ వీటి ని చంపిందెవరో.. ఎలా చంపారో సాక్ష్యాలతోజిల్లా పరిషత్ చైర్మన్ గా, నాలుగు సార్లు శాసన సబ్యునిగా పార్లమెంటు సబ్యునిగా మూడు ప్రబుత్వల్లో మంత్రిగా చేసిన మన హరి రామ జోగయ్య గారు అందరికి సుపరిచితులే. అయన వంగ వీటి రాధా ఎలా చనిపోయారు, అయన చనిపోవడానికి లేదా చంపబాడడానికి కి గల కారణాలేంటి, అసలు వంగ వీటి రాధను ఎలా చంపగలిగారు అన్న విషయాలను మీడియా కి, రాజకీయ నాయకులకి చాల మందికి కూడా తెలియని పచ్చి నిజాల్ని సాక్షాలతో మన ముందు ఉంచారు.

చేగొండి హరి రామ జోగయ్య గారు దాదాపు గా రాష్ట్రం లోని అన్ని పార్టీ లలో కూడా పని చేసారు, అయన ఒకానొక సమయం లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ స్వర్గీయ ముఖ్యమంత్రి అన్న మన పెద్ద యన్టి రామారావు గారికి అత్యంత సన్నిహితులుగా కూడా ఉన్నారు. వంగ వీటి రాధా మర్డర్ స్కెచ్ ఒకరోజులో నిర్న ఇంచింది కాదు అని చాలా స్పష్టం గా చెప్పారు. అసలు మరణానికి దారి తెసిన పరిస్థితులు అయన మాటల్లోనే, అప్పట్లో ఒక సంగటన జరిగింది రంగా హత్య గావింప బడటం, ఆ సందర్బం లో ముందు వెనుక కొన్ని నాకు సంబందించిన అనేక విషయాలు జరిగాయి. అప్పట్లో కాపు నాడు పెట్టారు, మిర్యాల వెంకటరావు గారు లాంటి పెద్దలు అందరు కలిసి కాపు నాడు పెట్టారు. కాపు నాడు కి లక్షమందికి పైగా కాపులు హాజరయ్యారు, ఆ సందర్బం ఆ సభ లో  యన్టి రామారావు గారిపై నేను దుమ్మెత్తి పోసాను. అయన మీద అనేకమైనటువంటి విమర్శలు గుప్పించాను. ఆ మర్నాడే నన్ను యన్టి రామారావు గారు అడిగారు ” ఏమండి మన కాపులు అందరు మనతోనే ఉండే వారు కదా అని ఎందుకు వీరందరూ నా మీద వేమర్సిస్తున్నారు ఇలా చేస్తున్నారు అని” అప్పట్లో కాపుల తరపున తెలుగుదేశం పార్టీ లో ఇంచుమించు నాయకత్వం వహిస్తూ ఉండే వాడిని, అయితే యన్ టి రామారావు గారికి నేను చెప్పా, ఏమి లేదండివంగవీటి మోహనరంగా విషయం లో వాళ్ళు భాగా రియాక్ట్ ఐనట్లు గా కనబడుతున్నది, దానికి ఎక్కువ ప్రచారం చేసినట్లు గా అనిపిస్తుంది కాపు నాయకులూ అంతా కూడా, మన ప్రబుత్వం వంగ వీటి రంగా కి ఉన్నటువంటి భద్రతను.. సెక్యూరిటీ ని కంప్లీట్ గా తొలగించారట, అలాగే విజయవాడ లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ లో కాపులు అనుకున్న వారినంతా అందరిని కూడా ట్రాన్స్ఫర్ చేసారంట. ఈ రెండు కారణాల వల్ల వంగ వీటి రంగా ప్రాణానికి హాని జరగబోతోంది ప్రభుత్వం వల్ల దీని వెనకాల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది అనేతువంటిది నమ్మి ఆ కాపు నాడు లో మే మీద అనేక రకాలైన విమర్శలు గుప్పించారు, దుమ్మెత్తి పోసారు ఇదండీ జరిగినవిషయం అని వివరించడం జరిగింది.

దీంతో కాపులను మచ్చిక చేసుకోవడం ఎలా వాళ్ళని మళ్ళి మనలో తిరిగి కలుపుకోవడం ఎలా అని కూడా అయన నన్ను అడిగారు, అయితే నేను ఆయనకి ఒక సలహా ఇచ్చా మీరు రంగా కి ఏదైతే సెక్యూరిటీ తెసేసారో ఆ సెక్యూరిటీ మరలా తిరికి అతనికి కల్పించండి అని చెప్పను, ఎలాగు కానిస్టేబుల్ దగ్గరనుండి ప్రతి కాపు ని అక్కడి నుండి ట్రాన్స్ఫర్ చేసారు వాళ్ళందరిని మీరు తిరిగి తెసుకేల్లి పెట్టలేరు కాని ఒక పోలీస్ కమీషనర్ ని అయినా కాపు ని అక్కడ పెట్టండి అని చెప్పా, అలాగే కాపులు ఎప్పటినుండో బిసి లలో చేర్చాలి అని అడుగుతున్నారు అది కూడా చేయండి అని చెప్పా లేదంటే బిసి కమిషన్ వేయండి అని చెప్పాను.అయితే ఆ నెక్స్ట్ డే నే యాన్టి రామారావు గారు నన్ను పిలిచి సారీ జోగయ్య గారు మనం మీరు చెప్పింది ఈ పరిస్థితులలో చేయలేము అని చెప్పారు ఎందుకు అంటే చంద్రబాబు గారు ఒప్పుకోవడం లేదు అని చెప్పారు.నేను కూడా సరే సర్ నేను చెప్పేది చెప్పా తర్వాత మీ ఇష్టం అని చెప్పడం జరిగింది.

ఎదయ్యింతర్వాత కొన్నాళ్ళకి శివ రామ రాజు గారు అని ఒకాయన అప్పట్లో మాజీ మంత్రి మంత్రి గా చేసారు, అయన ఒకరోజు అన్నారు ఏవండి ఈ విషయం మీకు తెల్సిందా రంగా ని ఇంక ఎన్తూ కాలం బఠాకనిచ్చేలా లేరు కదా అని అన్నారు. అదేంటండి అని అడిగితే.. ప్రభాకర్ రాజు అని న బెస్ట్ ఫ్రెండ్ ఒకాయన విజయవాడ లో ఉంటాడు, అయన నిన్న నాకు కలిసాడు అయన నాకొక విషయాన్నీ చెప్పుకొచ్చాడు ఆయన కొంతమంది తెలుగుదేశం ముక్యులు అందరు కలిసి యన్ టి రామ రావు గారిని కలిసి ఏవండి ఈ వంగవీటి రంగా ని బతకనిస్తే మన పార్టీ కి మనుగడ ఉండదు అసలు లేపెయ్యాల్సిన హిస్టరీ ఉంది మనవాళ్ళని ఎంతో మందిని చంపాడు, మీరు పర్మిషన్ ఇస్తే మేము ప్రోసీడ్  అవతం అని చెప్పేసి అడిగారంట. దానికి రామా రావు గారు ఒప్పుకోలేదంట, ఇలాంటివి నాదగ్గర ఎం చెప్పొద్దని చెప్పారంట, అప్పుడు వాళ్ళు రామారావు గారి సలహాదారులు ఐన చంద్రబాబు గారిని అడిగితే అయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట సో ఇక మేము ప్రోసీడ్ అవుతాం అని చెప్పారు అని అయన నాతో అన్నారు. అయితే అప్పుడు నేను ఆ విషయాన్నీ నమ్మలేదు, నేను నమ్మను అండి… మరీ చంపేయడం ఏంటి అని అన్నా… దానికి ఆయన లేదండి మీరు చూడండి ఇది జరుగుతుంది అని చెప్పాడు.. ఇది జరిగిన వారం రోజుల్లో వంగ వీటి రంగా ని చంపేశారు.. అప్పుడు ఈ విషయాన్ని నమ్మాల్సి వచ్చింది అని చెప్పారు


Comments

Facebook
నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu