క్రీడలు

సెంచరీతో క్రీజ్‌లో ఉన్న నా బిడ్డకు ఆ మరణ వార్తను చెప్పలేక పోయాను



ముంబయ్: ముంబయి వాంఖడే టెస్టులో జయంత్ యాదవ్‌ అద్భుత సెంచరీని అతని కుటుంబం ఆస్వాదిం చలేకపోయింది. తన మూడో టెస్టులోనే జయంత్ అసాధారణ ఇన్నింగ్స్‌ ఆడుతుంటే అతని కుటుం బం మాత్రం విషాదంలో మునిగింది. జయంత్ అమ్మమ్మ మరణించడమే అందుకు కారణం. ఢిల్లీలో జయంత్‌ ఆటను టీవీలో చూస్తూ ఆనందంతో పొంగిపోతున్న అతని తండ్రి జైసింగ్‌యాదవ్‌కు అనూహ్యంగా ఈ మరణవార్త తెలిసింది. ‘మా అబ్బాయి భారీస్కోరు చేస్తాడని మంచి భావనతో ఉన్నాను. అప్పుడు మా అత్తయ్య (జయంత్‌కు అమ్మమ్మ) మరణవార్త తెలియడంతో జలంధర్‌ బయల్దేరా. కాసేపటికే జయంత్ సెంచరీ చేశాడని ఫోనొచ్చింది. కొడుకు ప్రదర్శన పట్ల ఆనందపడాలో అత్తయ్య మరణంపట్ల దుఖించాలో తెలియలేద’ని అతని తండ్రి అన్నాడు.

అయితే ఏకాగ్రత కోల్పోతాడని ఆ వార్తను జయంత్‌కు తెలియనివ్వలేదట. కాగా, పదిహేడేళ్ల క్రితం విమాన ప్రమాదంలో జయంత్‌ తల్లి మరణించింది.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu