Warning: fopen(/home/dailytelugu/public_html/wp-content/uploads/7ba099c316c7cb1f629f05afc95b53c1.js): failed to open stream: Permission denied in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 78

Warning: fputs() expects parameter 1 to be resource, boolean given in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 79

Warning: fclose() expects parameter 1 to be resource, boolean given in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 80
జాతీయ

గగన తలాన ప్రతి భారతీయుడి మీసం తిప్పిన ఇస్రో



ఇప్పటికే పలు ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టి విజయాలను మూటగట్టుకున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఇప్పుడు మరో అద్భుతాన్ని ఆవిష్కరించడానికి సిద్దమైంది. ఇస్రో ఒక చారిత్రాత్మక ప్రయోగానికి సన్నాహాలు ప్రారంభించింది.

జనవరిలో ఒకేసారి 83 ఉపగ్రహాలను ప్రయోగించనున్నట్లు మంగళవారం ఒక ప్రకటన లో వెల్లడించింది ఇస్రో. తేదీ ఇంకా ఖరారు కానప్పటికీ జనవరి నెల చివరి వారంలో ఉండవచ్చని అంచనా. ఈ ప్రయోగానికి పీఎస్ఎల్‌వీ – 37 ను ఉపయోగించనున్నామని ఇస్రో చైర్మన్ ఎ.ఎస్.కిరణ్ కుమార్ తెలిపారు. 83 ఉపగ్రహాల్లో 80 ఇజ్రాయిల్, నెదర్లాండ్స్, ఖజకిస్తాన్, అమెరికా తదితర దేశాలకు చెందినవి. మూడు మాత్రం మన దేశ ఉపగ్రహాలు. ఇవి కార్టోశాట్‌ 2 సిరీస్ 730 కేజీలు, ఐఎన్‌ఎస్ ఐఏ, ఐఎన్ఎస్ 1బి రెండింటి బరువు కలిపి 30 కేజీలు ఉంటుందని అంచనా.

ఈ ఏడాది జూన్‌లో ఇస్రో రికార్డు స‌ృష్టిస్తూ శ్రీహరికోట నుంచి ఒకేసారి 20 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అంతకు ముందు 2008లో ఒకేసారి 10 ఉపగ్రహాలను ప్రయోగించింది. వచ్చే ఏడాది అయిదు సమాచార ఉపగ్రహాలను ప్రయోగించాలని లక్ష్యమని ఇస్రో చైర్మన్ చెప్పారు. అయితే భారత్ నుండి ఇన్ని ఉపగ్రహాలు పంపడం ఇదే మొదటి సారి కావడం విశేషం.

ఒక భారతీయ పోరుడిగా మనందరికీ ఇది చాలా గర్వించదగ్గ విషయం, ఈ ఆర్తిచ్లె ని ప్రతి భారతీయుడికి చేరే వరకు షేర్ చేయండి.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu