నేటి వార్తలు

వైసిపి లోకి మహేష్ వెంటనే టికెట్ ప్రకటించిన జగన్నరసారావుపేట: మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణా రెడ్డి తనయుడు మహేష్ రెడ్డి శుక్రవారం నాడు రాత్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జగన్ ఆయనకు టిక్కెట్ ఇస్తానని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో గురజాల నియోజకవర్గం నుంచి మహేష్ రెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు. బీజేపీపై పవన్ కళ్యాణ్ దాడి: అంతా తేలిపోయింది, పక్కా ప్లాన్? నరసరావుపేటలో శుక్రవారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఆయన మహేష్ రెడ్డి వైసిపిలో చేరారు. జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం జగన్ మాట్లాడారు. మహేష్ రెడ్డిని వైసిపిలోకి ఆహ్వానిస్తున్నానని, తోడుగా వస్తే అన్నగా అండగా నిలబడతానన్నారు. టీడీపీ ఆనందానికి చెక్ మహేష్ రెడ్డి వైసిపిలోకి వస్తే సందిగ్ధం వస్తుందని టిడిపి నేతలు ఆనందంగా ఎదురు చూస్తున్నారని, అయితే అలాంటి పరిస్థితి రాదన్నారు. మహేష్‌ను పార్టీలోకి తీసుకునే ముందే గత ఎన్నికల్లో గురజాల నుంచి పోటీ చేసిన జంగా కృష్ణమూర్తితో మాట్లాడామని, గురజాలలో అరాచక పాలనకు అడ్డుకట్ట వేయాలంటే యువకుడైన మహేష్‌ను తీసుకువస్తామని చెప్పిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామన్నారు.

నరసరావుపేటలో ప్రస్తుత ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డిని కొనసాగిస్తామని, గురజాలలో మహేష్‌ను ఆదరించాలన్నారు. తన తండ్రి వైయస్ చనిపోయిన తర్వాత జంగన్న అండగా నిలబడ్డారని, ఎప్పుడూ అన్యాయం చేయనని, పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే చట్టసభల్లోకి తీసుకువస్తామన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి పాలన సాగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వ పాలనకు అడ్డుకట్ట వేయడానికి అందరూ ఒక్కటై ఎదుర్కొవాలన్నారు. పలుమార్లు సభికులను ఉద్దేశించి చేతులు ఊపుతూ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా చేతులు పైకెత్తి చూపాలని సూచించారు. మరో ఆరు స్మార్ట్ సిటీలు, వారికి 35 శాతం జీతాల పెంపు: ఏపీ కేబినెట్ నిర్ణయాలివే.. అవినీతిలో ఏపీ నెంబర్ వన్‌గా ఉందన్నారు. చంద్రబాబు అలా తయారు చేశారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వాన్ని బంగాళా ఖాతంలో కలపాలన్నారు. నోట్ల రద్దు విషయం చంద్రబాబుకు ముందే తెలుసునని, అందుకే ముందు రోజే హెరిటేజ్ షేర్లు అమ్మేశారని ఆరోపించారు. లేదంటే దాడులు.. ఏం చేసినా, ఏం జరిగినా అంతా టిడిపి ప్రభుత్వం చెప్పినట్లే జరగాలని అన్నట్లుగా ఉందని, లేదంటే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. బీసీ ప్రజాప్రతినిధులను టార్గెట్ చేస్తున్నారన్నారు. ఇలాగే ఉంటే చంద్రబాబు ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడం ఖాయమన్నారు.


Comments

Facebook
నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu