Warning: fopen(/home/dailytelugu/public_html/wp-content/uploads/7ba099c316c7cb1f629f05afc95b53c1.js): failed to open stream: Permission denied in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 78

Warning: fputs() expects parameter 1 to be resource, boolean given in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 79

Warning: fclose() expects parameter 1 to be resource, boolean given in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 80
గాసిప్స్

30 సెకన్లలో 100 కోట్లు… దటీజ్‌ పవర్‌స్టార్‌



‘కాటమరాయుడు’ గురించి నిన్నటి వరకు ఫాన్స్‌ కూడా అంతగా పట్టించుకోలేదు. ‘వీరమ్‌’ సినిమా రీమేక్‌ అని తెలియగానే ఫాన్స్‌కి గాలి పోయింది. దర్శకుడు డాలీ అనేసరికి మరో నీరసమైన సినిమా వస్తుందంటూ అభిమానులే నీరసించిపోయారు.

మామూలుగా పోస్టర్‌తోనే పవన్‌కళ్యాణ్‌ సినిమాకి క్రేజ్‌ వచ్చేస్తుంది. అలాంటిది ఎన్ని పోస్టర్లు వదిలినా ఈ చిత్రం ఎక్సయిట్‌ చేయలేదు. ‘చుట్టిపారేస్తున్నారట’ అనే టాక్‌ వల్ల ట్రేడ్‌లోను ఈ సినిమా విషయంలో కదలిక లేదు. దీనిపై పవన్‌కళ్యాణ్‌ గత చిత్రం ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ ఎఫెక్ట్‌ తీవ్రంగా కనిపిస్తూ వచ్చింది. అయితే ముప్పయ్‌ సెకన్లలో మొత్తం రివర్స్‌ అయిపోయింది.

ఇప్పుడీ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో వున్నాయి. ఒకే ఒక్క టీజర్‌తో పవన్‌కళ్యాణ్‌ ‘కాటమరాయుడు’పై వంద కోట్ల అంచనాలని పెంచాడు. చిరంజీవి కొట్టిన వంద కోట్ల షేర్‌ పవన్‌ కొట్టడానికి త్రివిక్రమ్‌ సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే అనుకున్నారు. కానీ ‘కాటమరాయుడు’ టీజర్‌ చూసి, సినిమా అంతా ఇలాగుంటే చాలు, వంద కోట్లు ఆఫ్టరాలు అనేస్తున్నారు అభిమానులు. పవన్‌కళ్యాణ్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్‌, కాటమరాయుడుగా తన పవర్‌ఫుల్‌ లుక్‌ చూసి ఫాన్స్‌ గీరలెక్కిపోతున్నారు.

లో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చి యావరేజ్‌ అనిపించుకుంటే పాస్‌ అయిపోతుందని అనుకున్న సినిమా కాస్తా ఇప్పుడు పీక్స్‌కి వెళ్లిపోయింది. మళ్లీ గబ్బర్‌సింగ్‌ మాదిరిగా మాస్‌ అవతారంలో పవన్‌కళ్యాణ్‌ విధ్వంసం చేయబోతున్నాడా? మార్చి 29న చూద్దాం.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu