Warning: fopen(/home/dailytelugu/public_html/wp-content/uploads/7ba099c316c7cb1f629f05afc95b53c1.js): failed to open stream: Permission denied in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 78

Warning: fputs() expects parameter 1 to be resource, boolean given in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 79

Warning: fclose() expects parameter 1 to be resource, boolean given in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 80
నేటి వార్తలు

ఖైది నం 150 హిట్టా .. ఫట్టా



చిరంజీవి, బాలకృష్ణ ఇలా ఒకే సారి సంక్రాంతి బరి లో దిగడం ఇది 1 6 వ సారి, సంక్రాంతి పండగ ఆంధ్రలో చాలా ప్రతిష్టాత్మకం గా చేస్తారు. ఈ పండగ అక్కడ చేసినట్లు మరెక్కడా చేయరు, అందుకే సంక్రాంతి కి అటు ఫాన్స్ మద్య ఎటు హీరో ల్క మద్య ఎక్కువ పోటి ఉంటుంది. అయితే ఈ పోటి లో 70% ఆధిక్యం మన బాలయ్య బాబుదే. అయితే ఈ సారి విజయం కూడా అందరు బలయ్యదే అనడం లో తప్పేమీ లేదు అనిపిస్తోంది అందుకు గల కారణం కథ, గౌతమీపుత్ర శాతకర్ణి అనేది ఒక ఇండియన్ లెజెండరీ కింగ్ సినిమా, శతకర్నికి ప్రపంచ వ్యాప్తిగా క్యాతి ఉంది. అయితే అందరు ఖైది నo 1 5 0 ఒక రీమేక్ మూవీ అంటున్నారు సో మనవరకు రీమేక్ మూవీస్ అన్ని కలెక్షన్స్ పరంగా హిట్ కోడతాయే తప్ప ప్రజల మదిలో చిరకాలం నిలిచిపోలేవు, చరిత్ర సృష్టించలేవు.

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ట్రైలర్ రిలీజ్ కాకముందు ‘ఖైదీ నెంబర్ 150’పైనే ఎక్కువ అంచనాలు ఉండేవి. అందుకు కారణం.. ఆయన చాలాకాలం తర్వాత రీఎంట్రీ ఇస్తుండడమే! అందునా.. ఇది ఆయన 150వ చిత్రం కావడంతో దీనికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. పైగా.. ఈ మూవీ సబ్జెక్ట్ (తమిళ ‘కత్తి’) ఓ సోషల్ మెసేజ్‌తో కూడి ఉండడం మరింత కలిసొచ్చింది. మరోవైపు.. బాలయ్య చేస్తున్న ‘శాతకర్ణి’ సినిమా చారిత్రక కథాంశం కావడంతో.. అది జనాలను అంతగా ఆకట్టుకోకపోవచ్చునని అనుకున్నారు. దీంతో.. ఈసారి జరగబోయే సంక్రాంతి పోరులో చిరుదే పైచేయ్యి కావచ్చునని భావించారు.

కానీ.. ఎప్పుడైతే ‘శాతకర్ణి’ ట్రైలర్ రిలీజయ్యిందో అంచనాలన్నీ తారుమారయ్యాయి. ట్రైలర్‌లో చూపించిన అద్భుతమైన విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో ఉండడంతో.. సాధారణ ప్రేక్షకుల దగ్గర నుంచి దిగ్గజాలు సైతం దానికి దాసోహం అయిపోయారు. దీంతో.. ‘శాతకర్ణి’ సినిమాకి ఎనలేని క్రేజ్ వచ్చిపడింది. ఈ దెబ్బకి మెగా రేటింగ్ పడిపోయింది. ‘ఖైదీ నంబర్ 150’ కన్నా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’కే పాపులారిటీ ఎక్కువగా వస్తోంది. ఈ విషయం గ్రహించిన మెగా యూనిట్.. తమ మూవీని వాయిదా వేయాలని ఆలోచిస్తున్నట్లు జోరుగా ప్రచారం చేస్తోంది. ‘శాతకర్ణి’తో పోటీ పడడం కంటే.. సోలోగా వచ్చి హిట్ సంపాదించాలనే ఉద్దేశంతో వారం రోజులు గ్యాప్‌తో తమ చిత్రాన్ని విడుదల చేస్తే బాగుంటుందని చిత్రబృందం ఆలోచనలో పడిపోయిందని టాక్ వినిపిస్తోంది. మరి.. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu