నేటి వార్తలు

ఖైది నెం 150 కి దెబ్బేసింది ఎవరు…..



మెగాస్టార్ చిరంజీవి ఖైది నెం 150 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి భారీ వసూళ్లతో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఓవర్సీస్ లో కూడా ఇప్పడికే ఖైది నెం 150 2.5 మిలియన్ డాలర్స్ బెంచ్ మార్క్ ను దాటేసింది.  ఇక ఓవరాల్ గా తెలుగు లో బాహుబలి, శ్రీమంతుడు తర్వాత అత్యధిక వసూల్లు చేసిన చిత్రం గా ఉంది, మరో ఒకటి రెండు రోజుల్లోనే శ్రీమంతుడు రికార్డ్స్ ని సైతం ఖైది నెం 150 క్రాస్ చేసేస్తుంది అంటున్నారు.

అదే జరిగితే ఇప్పడి వరకు నాన్ బాహుబలి పేరు మీద శ్రిమంతుడికి ఉన్న రికార్డ్స్ అన్ని ఇప్పుడు ఖైది నెం 150 ఖాతాలో పడతాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఇంత పాజిటివ్ నోడ్ ఉన్న ఖైది నెం 150 ఓవర్సీస్ లో డిస్ట్రిబ్యూటర్ అత్యాశతో అక్కడ ఒక రికార్డు ని మిస్ కావలసి వస్తోంది అన్న సందేహం అందరిలో బలపడుతోంది.

ఖైది నెం 150 ఓవర్సీస్ రైట్స్ ను 12 కోట్లకు దక్కించుకున్న డిస్ట్రిబ్యూటర్ ప్రీమియర్ షో టికెట్ ను 25 డాలర్లకు అమ్మాడు. అక్కడ కేవలం ప్రీమియర్ షోలతో నే ఆ సినిమాకు 1.2 మిలియన్ డాలర్స్ వచ్చాయి ఇప్పుడు అక్కడ శాతకర్ణి కి 15 డాలర్లు, శతమానంభవతి కి 12 డాలర్లు టికెట్ రేట్ పెట్టడం తో ఖైది కలెక్షన్స్ తగ్గాయి అన్న వాదన వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు ఖైది అక్కడ 2.5 మిలియన్ డాలర్స్ ఐనా కలెక్ట్ చేస్తుందా లేదా అని అందరు ఎదురు చూస్తున్నారు.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu