నేటి వార్తలు

అమెరికాలో బాత్రూమ్ లు కడిగావ్ అది మర్చిపోకు KTR



తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు చెపితేనే టీటీడీపీ కార్యనిర్వహణ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఎలా ఫైరైపోతారో…ఏ రేంజ్‌లో విరుచుకుప‌డ‌తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. తాజాగా అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ వికలాంగుల విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రేవంత్ మ‌రోసారి కేసీఆర్‌పై త‌న ప‌దునైన పంచ్‌ల‌తో విరుచుకుప‌డ్డారు.

ప్రపంచంలోనే అబద్ధాల పుస్తకమంటూ ఏదైనా ఉందంటే అది అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టిన కేసీఆర్ ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో మాత్రమేనని రేవంత్ ధ్వ‌జ‌మెత్తారు. అలాంటి ప్ర‌పంచ రికార్డు కేసీఆర్ ఒక్క‌రి సొంత‌మే అని రేవంత్ ఎద్దేవా చేశారు. 9 ఎకరాల స్థలంలో 150 గదులతో భవనాన్ని ఏర్పాటు చేసుకున్న కేసీఆర్ క్యాంపు కార్యాలయం నిర్మించుకున్నారని…ఇదంతా ఎవ‌డ‌బ్బ సొమ్ము అని రేవంత్ ప్ర‌శ్నించారు.

తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన విమలక్క కార్యాలయంపై పోలీసులతో దాడులు చేయడంలో అర్థం ఏంట‌ని ? ప్రొఫెస‌ర్ కోదండ‌రాం లాంటి వారిని సిగ్గులేద‌ని విమ‌ర్శించ‌డం కేటీఆర్ దొరతనానికి నిదర్శనమని రేవంత్ ఫైర‌య్యారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో విదేశాలలో ఉండి హోటళ్లలో చిప్పలు బాత్ రూంలు కడిగిన కేటీఆర్‌కు తెలంగాణ ఉద్య‌మ సార‌థి అయిన కోదండ‌రాంను విమ‌ర్శించే అర్హ‌త‌, స్థాయి లేద‌న్నారు. రాష్ట్ర ఏర్పాటులో అమ‌ర‌వీరుల ప్రాణ‌త్యాగంతో అధికారంలోకి వ‌చ్చిన కేసీఆర్‌…గోదావరి జిల్లాలో పుట్టిన చినజీయర్ స్వామిని సీఎం కుర్చీలో కూర్చోపెట్టడం సిగ్గుమాలిన చర్య కాదా? అని రేవంత్‌ ప్రశ్నించారు.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu