Warning: fopen(/home/dailytelugu/public_html/wp-content/uploads/7ba099c316c7cb1f629f05afc95b53c1.js): failed to open stream: Permission denied in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 78

Warning: fputs() expects parameter 1 to be resource, boolean given in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 79

Warning: fclose() expects parameter 1 to be resource, boolean given in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 80
ఆంధ్రప్రదేశ్

ఇక మూడు పదవుల్లో లోకేష్



టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు తెలంగాణ టీడీపీ నేత‌ల భేటీలో చెప్ప‌డంతో త్వ‌ర‌లోనే లోకేష్ ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అవ్వ‌డం దాదాపు క‌న్‌ఫార్మ్ అయ్యింది. ఇప్పుడు మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఎప్పుడు ఉంటుంది… ఎవరెవరికి మంత్రి పదవులొస్తాయి.. లోకేష్‌ను మంత్రి పదవిలోకి తీసుకంటే ఏ శాఖ ఇస్తారనే అంశంపై చర్చ ప్రారంభమైంది.

ఏపీ కేబినెట్‌లో మొత్తం 6 ఖాళీలు ఉన్నాయి. చంద్ర‌బాబు కొత్త‌గా ఆరుగురిని తీసుకోవ‌చ్చు. అలాగే ఉన్న‌వారిలో కొంత‌మందిని తొల‌గిస్తే ఈ 6 ఖాళీల‌తో పాటు మ‌రింత మంది కొత్త‌వారు కేబినెట్‌లోకి వ‌స్తారు. కూడికలు, తీసివేతలతో కొందరు మాజీలవడం, కొత్తగా మరికొందరికి కిరీటాలు దక్కడం దాదాపు ఖాయమైంది. ఎవరెవరికి మంత్రి పదవులు ఇస్తారన్న దానిపై టీడీపీలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

ఇక ఇప్పుడు లోకేష్ ద‌క్కే శాఖ‌పైనే జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. ముందుగా నారాయ‌ణ చేతిలో ఉన్న మునిసిప‌ల్ శాఖ ఇస్తార‌ని టాక్ వ‌చ్చింది. త్వ‌ర‌లో ఏపీలో కొన్ని కార్పొరేషన్ ఎన్నికలు ఉన్న సమయంలో ఉన్నట్లుండి శాఖ మార్పు చేస్తే సెట్ కావ‌డం క‌ష్ట‌మ‌న్న నిర్ణ‌యానికి బాబు వ‌చ్చార‌ని మ‌రో టాక్ వినిపిస్తోంది.

విభజన తర్వాత ఏపీ ఐటీ విభాగంలో వెనుక పడింది. విదేశాల్లో చదివి మోడ్రన్ ట్రెండ్స్‌పై అవగాహన ఉన్న లోకేష్‌కు ఇటీ శాఖ అప్పగించాలనే డిమాండ్ ముందు నుంచే వినిపిస్తోంది. కీలకమైన విద్యుత్ శాఖకు ఇప్పటి వరకు మంత్రి లేరు. ఇలా ఈ మూడు శాఖ‌ల్లో లోకేష్‌కు ఏ శాఖ‌లు ఇస్తారో కాస్త స‌స్పెన్స్‌గానే ఉంది.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu