జాతీయ

మోడీ కి సపోర్ట్ గా నిలిచిన కాంగ్రెస్ పెద్దలు



అదేంటి కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్… ప్రస్తుత ప్రధాని మన్మోహన్ సింగ్ తీసుకున్న నోట్ల రద్దును సమర్థించడం ఏమిటి అనుకుంటున్నారా ? కానీ రాజకీయ వర్గాల్లో మాత్రం ఇదే ప్రచారం జరుగుతోంది. దేశాన్ని పదేళ్ల పాటు పాలించిన ప్రధానమంత్రే అయినా… అంతకంటే ముందు మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్త అనే విషయం అందరికీ తెలిసిందే. దేశ ఆర్థిక రంగం కష్టాల్లో ఉన్నప్పుడు ఆర్థికమంత్రిగా బాధ్యతలు తీసుకుని దేశం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోకుండా కాపాడిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. అలాంటి గొప్ప ఆర్థిక వేత్త అయిన మాజీ ప్రధాని… నోట్ల రద్దు నిర్ణయం సరైనదే అని తన సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానించారట.

వాస్తవానికి దేశంలోని ఆర్థిక వేత్తలంతా మోదీ నిర్ణయాన్ని సమర్థిస్తుండటంతో… తాను మాత్రం ఈ నిర్ణయంతో ఎలా విభేదిస్తానని కాంగ్రెస్ ముఖ్యనేతల దగ్గర మన్మోహన్ చెప్పినట్టు సమాచారం. ఒకవేళ ఈ అంశంపై తాను మాట్లాడాల్సి వస్తే… నిర్ణయాన్ని సమర్థించి అమలు తీరును తప్పుబట్టడానికి మాత్రమే పరిమితమవుతానని మాజీ ప్రధాని కాంగ్రెస్ నేతలకు షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఈ అంశంపై మాజీ ప్రధాని మన్మోహన్ నోరు విప్పకపోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి మోదీ నిర్ణయాన్ని మన్మోహన్ సమర్థిస్తే… ఇక అంశంలో బీజేపీని విమర్శించే అవకాశం ఆ పార్టీ కోల్పోతుందని చెప్పకతప్పదేమో.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu