ఆంధ్రప్రదేశ్

కవిత దగ్గర మోకాళ్ల మీద కూర్చున్న ఐఏఎస్హద్దులు చెరిగిపోతున్నాయి. అధికారానికి గులాంగిరీ చేసేయటం ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. పవర్ లో ఉన్న రాజకీయ నేతలకు వీలైనంత సన్నిహితంగా ఉండటం.. వారి అడుగులకు మడుగులు ఒత్తటం అలవాటుగా మారుతోంది. వ్యవస్థల మధ్య దూరాన్ని మొయింటైన్ చేయాలన్న ఇంగితాన్ని మర్చిపోతున్నారు. తాము వ్యక్తులం కాదని.. వ్యవస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామన్న విషయాన్ని మర్చిపోయి మరీ రాజభక్తిని ప్రదర్శిస్తున్న అధికారులు తీరు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. దేశంలోనే అత్యున్నత స్థాయి ఉద్యోగంగా చెప్పే ఐఏఎస్ గా ఉండి.. ఆ విషయాన్ని మరిచినట్లుగా వ్యవహరించిన ఇద్దరు ఐఏఎస్ ల తీరు ఇప్పుడు సంచలనంగా మారింది.

తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని అధికారాన్ని చెలాయిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మీద తమకున్న స్వామిభక్తిని ఒక కలెక్టర్ బహిరంగంగా ప్రకటిస్తే.. మరో ఐఏఎస్ అధికారి ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కమ్ ఎంపీ కవిత వద్ద మోకాళ్ల మీద కూర్చొని మాట్లాడిన వైనం అందరిని విస్తుపోయేలా చేసింది. అధికారులు తమ బాధ్యతల్ని మరిచి.. ప్రభుత్వానికి విధేయులుగా ఉంటున్నారన్న విమర్శ ఎప్పటి నుంచో ఉన్నా.. పరిస్థితి మరీ ఎంతలా దిగజారిపోయిందో తెలుసా అన్న విషయాన్ని తెలియజేసే ఘటనలు రెండు చోటు చేసుకున్నాయి.

రిపబ్లిక్ డే సందర్భంగా జగిత్యాలలో నిర్వహించిన ఉత్సావాల్లో ప్రసంగించిన ఆ జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ.. ‘‘మూడు శతాబ్దాల చరిత్ర కలిగిన జగిత్యాల ఖిల్లాలో గణతంత్ర దినోత్సవం జరుపుకునే అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పించారు. ఇందుకు సీఎంకు పాదాభివందనం చేస్తున్నాను’’ అని ప్రసంగించి.. రిపబ్లిక్ డేకు వచ్చిన అతిధులంతా అవాక్కు అయ్యేలా తన స్వామిభక్తిని ప్రదర్శించారు.

ఇదే కార్యక్రమంలో మరో ఐఏఎస్ అధికారి.. మెట్ పల్లి సబ్ కలెక్టర్ ముషారఫ్ అలీ.. మరింత విధేయతను ప్రదర్శించారు. గణతంత్ర దినోత్సవానికి ముఖ్యఅతిధిగా వచ్చిన ముఖ్యమంత్రి కుమార్తె.. ఎంపీ కవిత వద్దకు వెళ్లిన ఆయన.. ఆమె దగ్గర మోకాళ్ల మీద కూర్చొని మాట్లాడటం అందరిని విస్తుపోయేలా చేసింది. అత్యున్న స్థాయి అధికారులుగా ఉంటూ.. అధికారం ముందు మరీ ఇంత సాగిలపడటమా? అన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి అధికారులు వ్యవస్థలకు జవాబుదారీగా కాకుండా.. అధికార పక్షానికి ఎంత విధేయతగా ఉంటారన్న భావన కలిగేలా చేసింది. ఈ ఇద్దరు ఐఏఎస్ ల తీరు అందరిని నివ్వెరపోయేలా చేయటమే కాదు.. పెద్ద చర్చకు తెర తీసిందని చెప్పక తప్పదు.


Comments

Facebook
నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu