నేటి వార్తలు

బ్లాక్ మనీ కలెక్షన్ తుది దశకు చేరింది.. ఇక మిగిలింది పేదవారి అకౌంట్స్ లో జమచేయడమేపెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ఎవరి మీద దెబ్బ పడుతుందో అందరికీ తెలిసిన ముచ్చటే. మరి.. నోట్ల రద్దు నిర్ణయంతో లాభం ఎవరికి? ఎలా? అన్నది ఆసక్తికర ప్రశ్న. పెద్దనోట్లను రద్దు చేయటం ద్వారా కేంద్రానికి భారీ లాభం కలగనుందని.. అంతిమంగా ఈ లాభం రాష్ట్రాలకు వాటా దక్కనుందన్నది కొందరి విశ్లేషకుల మాట. అదెలా అన్న లెక్కలోకి వెళితే.. ఆసక్తికరంగా ఉండటమే కాదు.. కూసింత విస్మయానికి గురి చేయక మానదు. పెద్ద నోట్ల రద్దు  కారణంగా నల్లకుబేరులకు భారీ షాక్ అన్నది పాత చింతకాయే. అయితే.. మోడీ సంచలన నిర్ణయం కారణంగా నల్లకుబేరులకు తగిలే నోట్ల షాక్ ఎంత ఉండొచ్చు? ప్రభుత్వానికి అదెలా ప్లస్ అవుతుందో చూస్తే..

దేశంలో చెలామణిలో ఉన్న ప్రతి రూపాయికీ కేంద్రం నేతృత్వంలోని ఆర్ బీఐ పూచీకత్తుగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వం ప్రింట్ వేసే ప్రతి నోటుకు తగిన ఆర్థిక వనరులకు సంబంధించిన లెక్కలన్నీ అందరికి తెలిసినవే. వాటిని పక్కన పెడితే.. తాజాగా పెద్ద నోట్ల రద్దుతో ప్రభుత్వానికి భారీ లాభం ఎలా చేకూరుతుందన్న విషయాన్ని చూస్తే.. లెక్కల చిక్కుల్లోకి వెళ్లాల్సిందే. ఈ మొత్తం వ్యవహారాన్ని సింఫుల్ గా చెప్పాలంటే.. ప్రస్తుతం  దేశం మొత్తం మీదా చెలామణిలో ఉన్న మొత్తం రూపాయి అనుకుందాం. ఆ రూపాయి మొత్తం రకరకాల నోట్లలో ఉందని అనుకుందాం. అలా వేసుకుంటే 500.. 1000 నోట్ల వరకే 80పైసలు వరకూ ఉంది. మిగిలిన 20పైసలు 100.. 50..20..10..5 నోట్ల కింద ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్నతాజా నిర్ణయంతో 80పైసలకు సంబంధించిన 1000.. 500 నోట్లు తిరిగి ప్రభుత్వం వద్దకు చేరాలి. అలా చేరితే తన దగ్గర ఉన్న చిల్లర నోట్లను కానీ.. కొత్త నోట్లను కానీ ఇస్తుంది.

ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే ఉంది అసలు లెక్కంతా. 1000..500 నోట్ల రూపంలో ఉన్న 80పైసల మొత్తంలో అధికారికంగా ఉన్నది దాదాపు 50 పైసలు అయితే.. నల్ల కుబేరుల దగ్గర ఉన్నది 30 పైసలు. ఇప్పుడు ప్రభుత్వం దృష్టి అంతా ఆ 30 పైసలు మీదనే. ఎందుకంటే.. ఆ 30 పైసల మొత్తం బ్యాంకుల్లోకి తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే.. అలావస్తే వాటి లెక్క చూపించాల్సిందే. అలా చూపించినా.. చేతికి తిరిగి ఇచ్చే మొత్తం చాలా తక్కువ. దానికి తోడు.. అలా ఎలా చేశారంటూ వేసే ప్రశ్నలతో జరిగే నష్టంతో పోలిస్తే.. నల్లధనాన్ని వీలైనంతవరకూ బయటకు రాకుండా చేసేందుకే ప్రయత్నాలు జరుగుతాయి.

ఒకవేళ అలా కాకుండా.. ఏదో ఒక మార్గం ద్వారా వైట్ చేసే ఆలోచన చేసినా 5 పైసలు వరకూ చేయగలుగుతారని చెబుతున్నారు. మరీ.. తెలివిగా చేస్తే 10 పైసలు వరకూ చేయొచ్చు. కానీ.. అది చాలావరకూ సాధ్యం కాదనే మాటే వినిపిస్తోంది. అంటే.. బ్లాక్ మనీకి సంబంధించిన 25 పైసలు తాజా నిర్ణయంతో చెలామణిలోకి లేకుండా పోతుంది. ముందుగా చెప్పినట్లే.. చెలామణీలో ఉండే ప్రతి పైసాకు ప్రభుత్వం బాధ్యత వహించిన నేపథ్యంలో.. పెద్దనోట్ల రద్దుతో పాత నోట్లకు సంబంధించి చాలావరకూ చెలామణీలోకి లేకుండా పోతుంది. అదిజరిగినప్పుడు.. ఆ తేడా మొత్తాన్ని కొత్త నోట్లను ప్రింట్ చేసుకునే వెసులుబాటు ఆర్ బీఐకి ఉంటుంది. అలా ప్రింట్ చేసిన మొత్తం.. కేంద్రం ఖాతాకు మళ్లుతుంది. ఇందాక వేసిన లెక్కను మరోసారి గుర్తు చేసుకుంటే.. నల్లకుబేరుల దగ్గర ఉండిపోయి బయటకు రాని 25పైసల్ని కేంద్రం కొత్తగా ప్రింట్ వేసుకొని చెలామణీలోకి తీసుకొస్తుంది. తన అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేస్తుంది. పైసల్లో చూసినప్పుడు ఈ మొత్తం చాలా చిన్నదిగా అనిపించినా.. 25పైసల్ని.. వాస్తవ లెక్కలతో పోల్చి చూసినప్పుడు అయ్యే మొత్తం ఎంతో తెలుసా?అక్షరాల రూ.4లక్షల కోట్ల వరకూ ఉంటుందని చెబుతున్నారు. ఇప్పుడు అర్థమైందా? పెద్ద నోట్ల రద్దుతో కేంద్రానికి ఎంత లాభమో.

మరీ.. ఈ లాభం కేంద్రమే పొందుతుందా? అంటే లేదని చెప్పాలి. కేంద్రం తన నిధుల్ని రాష్ట్రాలకు పంచే క్రమంలో.. ఆ ప్రయోజనం దేశంలోని రాష్ట్రాలన్నింటికి కలగటం ఖాయంగా చెప్పాలి. ఇప్పటివరకూ రూపాయి.. పైసలతో చెప్పిన లెక్కను.. వాస్తవ అంకెల్లో చెప్పే ప్రయత్నం చేస్తే.. లెక్క ఇలా ఉండనుంది.

ఒక అంచనా ప్రకారం దేశంలో చెలామణీలో ఉన్న నోట్ల మొత్తం విలువ రూ.17.17లక్షల కోట్లు. ఇందులోరూ.వెయ్యి.. రూ.500 నోట్ల విలువ రూ.14.61 లక్షల కోట్లు. ఇందులో బ్యాంకుల్లోనూ.. అధికారిక లెక్కల్లో ఉన్న మొత్తం రూ.9.5లక్షల కోట్లు. లెక్కలకు చిక్కుండా నల్ల కుబేరులు బ్లాక్ చేసిన మొత్తం రూ.5.11 లక్షల కోట్లు. ప్రధాని మోడీ చేసిన పెద్దనోట్ల రద్దు దెబ్బకు బ్యాంకులకు వచ్చే పెద్ద నోట్ల మొత్తం రూ.1 నుంచి రూ.1.5లక్షల కోట్లుగా చెబుతున్నారు. ఇక.. శాశ్వితంగా బయటకు రాని మొత్తం రూ.3.61 లక్షల కోట్ల నుంచి రూ.4.11 కోట్లుగా తెలుస్తోంది. ఈ మొత్తాన్నే కేంద్రం తన కొత్త నోట్లను ముద్రించి.. తన బొక్కసానికి తరలించి.. రాష్ట్రాలకుఅందులో నుంచి వాటా ఇవ్వనుందని చెప్పొచ్చు. పెద్దనోట్ల రద్దుతో ఎవరికి ఎంత లాభమో ఇప్పుడు అర్థమైందా..?


Comments

Facebook
నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu