సినిమాలు

తన అప్పుల చిట్టా విప్పిన నాగ్



బ్యాంకులు నుంచి భారీగా రుణాలు తీసుకొని.. తిరిగి ఇవ్వని బడా బాబులకు సంబంధించిన వార్తలు ఈ మధ్య వస్తున్నాయి. అయితే.. ఈ ఆరోపణల్లోకి టాలీవుడ్ హీరో  నాగార్జున పేరు కూడా వినిపించింది. అయితే.. డబ్బు లెక్కల విషయంలో నాగ్ ఆచితూచి వ్యవహరిస్తారని.. ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వరన్న పేరు ఉంది. అలాంటి వ్యక్తి మీద ఆరోపణలు రావటంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో.. దీనిపై స్పందించిన నాగ్.. తనపై వస్తున్న ఆరోపణలు.. ఊహాగానాలపై వివరణ ఇచ్చారు.

తాజాగా ట్విట్టర్ లో ట్వీట్ చేసిన ఆయన.. తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేయటంతో పాటు.. తాను బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్న మాట వాస్తవమే అయినా.. వాటిని తిరిగి చెల్లించిన విషయాన్ని స్పష్టం చేశారు.

అన్నపూర్ణ స్టూడియో అభివృద్ధి కోసం బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నామని.. అయితే.. ఈ ఏడాది మొదట్లోనే దాన్ని చెల్లించినట్లుగా చెప్పిన నాగార్జున.. కొంతమంది ఆరోపిస్తున్నట్లుగా తాను కానీ.. అన్నపూర్ణ స్టూడియోస్ పేరుతో బ్యాంకులకు ఎలాంటి బకాయిలు లేవన్నారు. నాగ్ ఇచ్చిన వివరణతో బ్యాంకులతో బాకీ పంచాయితీలు ఏమీ లేవన్న విషయం అధికారికంగా స్పష్టమైనట్లుగా చెప్పొచ్చు.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu