ఆంధ్రప్రదేశ్

నాగ్ కి చంద్రబాబు కి మద్య ఎం జరిగిందిటాలీవుడ్‌లో ఇప్పుడు అక్కినేని నాగార్జున కొడుకుల ప్రేమ వ్య‌వ‌హారం బాగా హైలెట్ అవుతోంది. నాగ్ కొడుకులు చైతు, అఖిల్ ఇద్ద‌రూ కొద్ది రోజులుగా ప్రేమ వ్య‌వ‌హారాల‌తో వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఇక ఈ ఇద్ద‌రి కుమారుల్లో నాగ్ ముందుగా త‌న చిన్న కుమారుడు అఖిల్ – శ్రియా భూపాల్‌రెడ్డి వివాహాన్ని ముందుగా చేసేందుకు డిసైడ్ అయిన సంగ‌తి తెలిసిందే.

అఖిల్ ఎంగేజ్‌మెంట్ డిసెంబ‌ర్ 9న జ‌ర‌గ‌నుంది. ఈ వివాహానికి నాగ్ అతిర‌ధ మ‌హార‌థులంద‌రిని ఆహ్వానిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే పిలుపులు స్టార్ట్ చేసిన నాగ్, రీసెంట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును కూడా సతీ సమేతంగా రావాలని ఆహ్వానించారు. తెలంగాణ సీఎంగా కేసీఆర్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ప్పుడు నాగ్ ఆస్తుల‌ను టార్గెట్‌గా చేసి దాడులు చేసిన సంగ‌తి తెలిసిందే.

అలాంటి కేసీఆర్‌ను నాగ్ ఇప్పుడు త‌న కుమారుడు పెళ్లికి కాకుండా ఎంగేజ్‌మెంట్‌కు సైతం పిలిచి అంద‌రిని ఆశ్చ‌ర్యంలో ప‌డేశాడు. కేసీఆర్‌ను పిలిచిన నాగ్ ఇప్పుడు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడును పిలుస్తాడా ? లేదా ? అన్న‌దే పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాగార్జున అప్పటి ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కలిశారు. వీళ్ళ మధ్య మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. ఆ త‌ర్వాత నాగ్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డితో పాటు ఆయ‌న కొడుకు జ‌గ‌న్‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యాడు. బిజినెస్‌లో నాగ్ మిత్రులంద‌రూ జ‌గ‌న్ అండ్ వైఎస్‌కు జాన్ జిగిరీ దోస్తులే. వీరితో ఎక్కువ‌గా ఎటాచ్‌మెంట్‌లో ఉండే నాగ్ ప్ర‌ధాని మోడీని సైతం క‌లుస్తుంటాడు.. కానీ పక్కనే ఉన్న చంద్రబాబు ఊసే ఎత్తడు.

ఇక బాబు బావ‌మ‌రిది మ‌రో స్టార్ హీరో బాల‌య్య‌తో సైతం నాగ్‌కు స‌న్నిహిత సంబంధాలు లేవు. ఒక‌వేళ నాగ్ బాబును క‌లిసి ఎంగేజ్‌మెంట్‌కు పిలిచినా బాబు వెళ‌తారా ? లేదా ? అన్న‌ది కూడా డౌటే..? అఖిల్ పెళ్ళాడుతున్న శ్రియా భూపాల్ జీవీకే మనవరాలు. జీవీకే కు అటు ఆంధ్రలో కూడా పలు బిజినెస్ లు ఉన్నాయి కాబట్టి, చంద్రబాబుతో తప్పకుండా పనులు ఉంటాయి. మ‌రి ఈ విష‌యం ఇప్పుడు సినిమా, రాజ‌కీయ‌వ‌ర్గాల్లో సంచ‌ల‌న‌మైంది.


Comments

Facebook
నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu