Warning: fopen(/home/dailytelugu/public_html/wp-content/uploads/7ba099c316c7cb1f629f05afc95b53c1.js): failed to open stream: Permission denied in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 78

Warning: fputs() expects parameter 1 to be resource, boolean given in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 79

Warning: fclose() expects parameter 1 to be resource, boolean given in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 80
ఆంధ్రప్రదేశ్

నారా చంద్ర‌బాబు నాయుడు ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్‌ను ప‌క్క‌న పెట్టారా ? అసలేం జరిగింది



ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఏపీ మీడియా స‌ల‌హాదారు ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్‌ను ప‌క్క‌న పెట్టారా ? ప‌ర‌కాల ఓవ‌ర్‌యాక్ష‌న్‌పై బాబు ఇప్ప‌టికే ప‌లు ఫిర్యాదులు వెళ్ల‌డంతో బాబు ఆయ‌న తోక క‌ట్ చేశారా ? ప్ర‌స్తుతం ప‌ర‌కాల‌కు బాబు వ‌ద్ద అంత సీన్ లేదా ? అంటే అవున‌నే స‌మాధానాలే వ‌స్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి గా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మీడియా సలహాదారుగా నియమితులైన పరకాల ప్రభాకర్ ఓ వెలుగు వెలిగారు. చాలా కాలం ఇది సాగింది. ఏ విదేశీ పర్యటనలో అయినా ఆయన ఉండాల్సిందే.

కొంద‌రు మంత్రులు, సీనియ‌ర్ ఐఏఎస్ అధికారుల కంటే ప‌ర‌కాల‌కే బాబు ఎక్కువుగా ప్ర‌యారిటీ ఇచ్చారు. దీనిపై అప్ప‌ట్లోనే పెద్ద చ‌ర్చ కూడా జ‌రిగింది. అయితే ఓటుకు నోటు కేసులో మీడియా ముందు అప్పట్లో పరకాల ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని తీవ్ర ఇరకాటంలోకి నెట్టాయి. ఇటీవల కాలం వరకూ ఆయన హవానే సాగింది.

ప‌ర‌కాల భార్య నిర్మ‌లాసీతారామ‌న్ కేంద్రంలో మంత్రిగా ఉండ‌డంతో ప‌ర‌కాల ద్వారా ఆమెతో ఎన్నో ప‌నులు చేయించుకోవ‌చ్చ‌ని బాబు సైతం భావించారు. అయితే ప‌ర‌కాల బాబుకు ప్ల‌స్ అవుతార‌నుకుంటే మీడియా ముందు అన‌వ‌స‌రంగా నోరు జారడం. మీడియాను స‌రిగా మేనేజ్ చేయ‌లేక‌పోవ‌డంతో ఆయ‌న‌పై బాబు తీవ్ర అసంతృప్తితో ఉంటున్నారు.

ఇక చంద్ర‌బాబు కొద్ది రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ పౌరసంబంధాల శాఖ కమిషనర్ గా ఎస్. వెంకటేశ్వర్ ను నియమించారు. అప్పటి నుంచి ఆయన నిత్యం చంద్రబాబుకు వెన్నంటి ఉంటున్నారు. దీంతో పరకాలకు పెద్దగా పనిలేకుండా పోయింది. ప్ర‌స్తుతం ఏపీ పాలన అంతా వెల‌గ‌పూడి నుంచే కొన‌సాగుతుంటే ప‌ర‌కాల మాత్రం హైద‌రాబాద్‌లో ఉంటున్నారు. దీనిని బ‌ట్టే ప‌ర‌కాల‌ను బాబు ప‌క్క‌న పెట్టార‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

ఇక బాబు త‌న‌ను ప‌క్క‌న పెట్టిన విష‌యాన్ని గుర్తించిన ప‌ర‌కాల మీడియా సలహాదారుగా ఉన్న తనకు ఇప్పుడు కనీస గుర్తింపు కూడా ఇవ్వటంలేదని తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారని స‌మాచారం.

 


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu