నేటి వార్తలు

పాక్ గుప్పిట్లో ఉత్తర భారత్!ఇస్లామాబాద్: ఏడొందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించగల సామర్థ్యం ఉన్న బాబర్-2 క్రూయిజ్ మిసైల్‌ పరీక్షను పాకిస్థాన్ విజయవంతంగా నిర్వహించింది. భూమిపై ఉన్న లక్ష్యాలతో పాటు సముద్రంపై ఉన్న లక్ష్యాలను కూడా బాబర్-2 చేధించగలదు. వార్‌హెడ్స్‌ను మోసుకెళ్లే సామర్థ్యం కూడా ఉంది. ఈ క్షిపణి అభివృద్ధికి చైనా సహకరించిందని తెలుస్తోంది. భారత్ లక్ష్యంగా రూపొందించిన బాబర్-2 రాకతో పాక్ రక్షణ సామర్థ్యం మరింత బలోపేతమౌతుందని సైన్యాధికారులు చెప్పుకుంటున్నారు. బాబర్-2 క్షిపణి పరీక్ష విజయవంతం కావడంపై పాక్ ప్రధాని, అధ్యక్షుడు సైంటిస్టులను అభినందించారు. బాబర్-2 టార్గెట్‌లో ఢిల్లీ, ఛండీఘర్ సహా ఉత్తరభారతదేశంలోని చాలా భాగాలు ను బాబర్-2 తాకగలదు.

బాలిస్టిక్ మిసైల్‌ల కన్నా క్రూయిజ్ మిసైల్‌లు ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాలిస్టిక్ క్షిపణులను కూల్చడం తేలికని, అయితే క్రూయిజ్ క్షిపణులను కూల్చడం కష్టమని చెబుతున్నారు. బాబర్-2 పరీక్షను విజయవంతంగా నిర్వహించడం ద్వారా పాకిస్థాన్ దాదాపు ఉత్తరభారతదేశన్నంతటినీ తన గుప్పిట్లోకి తెచ్చుకోగలదని రక్షణ నిపుణులు చెబుతున్నారు.


Comments

Facebook
నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu