ఆంధ్రప్రదేశ్

పవన్ కళ్యాణ్ లో అస్ప’ష్టతజనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ కొంత స్పష్టత, మరికొంత అస్పష్టతతో ,కొంత ధైర్యంతో ,కొంత భయంతో ప్రసంగించినట్లుగా కనిపిస్తుంది. ప్రత్యేక హోదాపై అనంతపురం లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడిన తీరు కొంత ముందుకు,మరికొంత వెనక్కి అన్నట్లుగా ఉందన్న భావన కలుగుతుంది.ప్రత్యేక హోదా ను పాచిలడ్డూలతో కాకినాడ సభలో పోల్చిన పవన్ కళ్యాణ్ ఆ ఘాటును కొనసాగించలేదు.కాకపోతే వంచన,మోసం వంటి పదాలను మాత్రం వాడారు.కేంద్ర అప్పట్లో పాచిపోయిన లడ్డూలు అన్నదానిపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తీవ్రంగా స్పందించారు. సుగర్ వ్యాది ఉండవచ్చని ఆయన అన్నారు. మరి దీనికి సమాదానంగా పవన్ కళ్యాణ్ అవి పాచిలడ్డూలే అన్న విషయాన్ని నొక్కి వక్కాణించలేకపోయారు.కాకపోతే కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో ఏమీ లేదన్న సంగతి ఆయన ఎంతో కష్టపడి చదివితే అర్ధం కాలేదని అనడం కొంత ఆశ్చర్యంగా ఉంటుంది. ప్యాకేజీ గురించి పుంఖానుపుంఖాలుగా వార్తలు,వ్యాసాలు వస్తే ,దానిపై ఒక అబిప్రాయానికి రావడానికి పవన్ కు ఇంతకాలం పట్టిందన్నమాట.ఇదే సమయంలో ప్యాకేజీ విషయంలో మాత్రం కొంత స్పష్టంగానే తన అబిప్రాయం చెప్పారనుకోవాలి.కాని ప్రధాని మోడీకి సంబందం లేనట్లు మాట్లాడడం మాత్రం ఆశ్చర్యంగానే ఉంటుంది.

పోలవరం, రాయలసీమ, ఉత్తరాంద్ర రాయితీల గురించి పవన్ ప్రసావించి ,అవి కూడా సరిగా అమలు కావడం లేదని చెప్పారు.వెంకయ్య నాయుడుకు చంద్రబాబు సన్మానాలు చేయడం గురించి కూడా మాట్లాడారు. బిజెపి మోసం చేసింది,వంచన చేసిందన్న విషయాల వరకు క్లారిటీగానే ఉన్నట్లు అనిపించింది.కాని ఈసారి వెంకయ్య నాయుడుపై కాని, చంద్రబాబు నాయుడుపై కాని గట్టిగా విమర్శలు చేయడానికి పవన్ సిద్దపడినట్లు అనిపించలేదు.తాను ఒక కులానికి చెందినవాడిని కానని చెబుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఒక కులానికి, వర్గానికి ,ఒక ప్రాంతానికి అనుకూలంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయని అన్నారు.సింగపూర్ లో అవినీతి రహితంగా ఉండాలి కాని అక్కడమాదిరి పెద్దపెద్ద భవనాలు కట్టడం కాదని అన్నారు.ఇప్పటికే ఈ అంశాలన్నిటిపైన అనేక విమర్శలు,ఆరోపణలు వచ్చిన సంగతి పవన్ కు ఇంతవరకు తెలియదా అన్న ప్రశ్న వస్తుంది. ఆ ఆరోపణల గురించి నిర్దిష్ట వ్యాఖ్యలు చేయకుండా ,కొంత తగ్గి మాట్లాడినట్లుగా ఉంది.

ఇక జనసేన పార్టీ మొత్తంగా ఎపిలో పోటీచేస్తుందని చెప్పి ఉంటే స్పష్టత ఉండేది .అలాకాకుండా తాను పోటీచేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే బిజెపి,టిడిపిలతో బందం ఉంటుందా ?ఉండదా? ప్రత్యేక హోదా, ఇతరత్రా ఎపి ప్రభుత్వంపై చేసిన ఆరపణలు వంటివాటిని దృష్టిలో ఉంచుకుని ఆ పార్టీలకు దూరంగా ఉంటారా? ఉండరా అన్నది చెప్పలేదు. అదే సయమంలో గెలిచినా,ఓడినా అంటూ ముందుగానే సందేహాలతో ఆయన రాజకీయ ప్రస్తానం ఆరంభించినట్లుగా కనిపిస్తుంది.ఇంతవరకు జరిగిన వివిధ సభలకు తెలుగుదేశం పార్టీ పరోక్షంగా సహకరించిందన్న ప్రచారం ఉంది. అందులో నిజం ఉంటే పవన్ కు కొంత ఇబ్బందే.

అంతేకాదు. ఇప్పటికైతే లోకేష్ తాము పవన్ కళ్యాణ్ విమర్శలను పాజిటివ్ గానే తీసుకుంటాం అని చెప్పడం ద్వారా ఆయన తమకు మిత్రుడే అన్న సంకేతం ఇచ్చేయత్నం చేశారు.ఒక వేళ తమకి పవన్ దూరం అయ్యారనుకుంటే టిడిపి దాడి చేయడం ఆరంభిస్తుంది.ఇతర పక్షాల సంగతి ఎలా ఉన్నా, పవన్ వ్యక్తిగత జీవితంపై ,సినీ జీవితంపై దాడి చేయడానికి కూడా ఆ పార్టీ వెనుకాడదు. వీటన్నిటిని ఎదుర్కోవడానికి పవన్ కళ్యాణ్ ధైర్యంగా ఉంటారా?లేక భయపడతారా అన్న ప్రశ్నలు వస్తాయి.మొత్తం మీద పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం ఆయన అబిమానులకు సంతోషం కలిగించే విషయమే. గతసారి కి మల్లే ఆయన టిడిపి ,బిజెపిలకు పావుగా ఉపయోగపడతారా?లేక వాటిని ఎదిరంచే ధైర్యం చేస్తారా అన్నది తేలడానికి మరికొంత సమయం పట్టవచ్చు.పవన్ కళ్యాణ్ ఇంతవరకు అసలు రాజకీయం చేయలేదు.దాని తీవ్రత ఎలా ఉంటుందో తెలియదు.ఇకపై ఆ అనుభవం పవన్ కు ఆరంభం అవుతుంది.


Comments

Facebook
నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu