గాసిప్స్

ఇకనుండి పవన్, జగన్ భాయి భాయి..!!



ప్ర‌త్యేక హోదా కోసం పోరాడేందుకు వైసీపీతోనే అయిన క‌లిసి ప‌నిచేసేందుకు తాను రెడీయే అంటూ జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చేసిన ప్ర‌క‌ట‌న ఏపీ రాజ‌కీయాల్లో కాస్త సంచ‌ల‌నాల‌కు కార‌ణ‌మైంది. ప‌వ‌న్ ఈ ప్ర‌క‌ట‌న చేసిన త‌ర్వాత వైసీపీ-జ‌న‌సేన కలుస్తాయంటూ ఏపీ ఇన్న‌ర్ పాలిటిక్స్‌లో ర‌క‌ర‌కాల వార్త‌లు మీడియాలోను, సోష‌ల్ మీడియాలోను హ‌ల్‌చ‌ల్ చేశాయి.

ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న త‌ర్వాత కొంద‌రు వైసీపీ నాయ‌కులు ప‌వ‌న్‌తో క‌లిసి వెళ్లేందుకు అయిష్ట‌త వ్య‌క్తం చేస్తూ ప్ర‌క‌ట‌న‌లు కూడా చేశారు. అయితే ఇప్పుడు అదే వైసీపీకి చెందిన ఓ సీనియ‌ర్ లీడ‌ర్‌, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మాత్రం ప‌వ‌న్‌తో క‌లిసి ప‌నిచేసే ప్ర‌తిపాద‌న‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనను ఆపేందుకు జనసేన సహా – సీపీఐ – సీపీఎం తదితర ఏ పార్టీలతోనైనా పొత్తుకు సిద్ధమని విజయసాయి రెడ్డి ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన క్రమంలో తమతో ఎవరు కలిసి వచ్చినా స్వాగతిస్తామని వారితో కలసి పోరాడేందుకు సిద్ధమని విజయసాయి అన్నారు.

అలాగే ఏపీకి తీర‌ని ద్రోహం చేసిన కాంగ్రెస్‌తో పాటు బీజేపీతో క‌లిసి ప‌నిచేసేందుకు తాము సిద్ధంగా లేమని ఆయ‌న చెప్పారు. బీజేపీతో పొత్తు కోసం గతంలోనే ఆఫర్ వచ్చినా తాము ఆసక్తి చూపలేదని చెప్పేశారు. ఇక ప్ర‌త్యేక హోదా కోసం ఫైట్ చేస్తోన్న ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌మ‌తో చేతులు క‌లుపుతామ‌ని అంటే కాద‌న‌డం ఎందుక‌ని కూడా ఆయ‌న ప్ర‌శ్నించారు.

సో ఈ లెక్క‌న ప‌వ‌న్‌తో క‌లిసి ప‌ని చేసేందుకు వైసీపీ రెడీగానే ఉన్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఈ లెక్క‌న 2019లో ఏపీ పాలిటిక్స్‌లో స‌రికొత్త పొత్తుల లెక్క‌న మ‌నం చూస్తామా ? అన్న‌ది చూడాలి.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu