నేటి వార్తలు

19 ఏళ్ల అమ్మాయితో పవన్



ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఒకేసారి మూడు సినిమాల‌ను ప‌ట్టాలెక్కించాడు. ప‌వ‌న్ ప్ర‌స్తుతం గోపాల‌…గోపాల డైరెక్ట‌ర్ డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాటమరాయుడు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా త‌ర్వాత మ‌రో రెండు సినిమాల‌ను కూడా ఎనౌన్స్ చేసేశాడు. వీటిల్లో ఒక‌టి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ డైరెక్ష‌న్‌లోను, మ‌రొక‌టి కోలీవుడ్ డైరెక్ట‌ర్ నీశ‌న్ డైరెక్ష‌న్‌లోను చేయ‌నున్నాడు.

2019 ఎన్నిక‌ల్లో దిగుతోన్న ప‌వ‌న్ ఈ మూడు సినిమాల‌ను ఈలోగానే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అందుకే కాటమరాయుడు సినిమా సెట్స్ మీద ఉండగానే తరువాతి సినిమాలకు నటీనటులు, సాంకేతిక నిపుణులను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. కాటమరాయుడు తరువాత తమిళ దర్శకుడు నేసన్ డైరెక్షన్ లో ఏఎమ్ రత్నం నిర్మించే రీమేక్ సినిమాలో నటించనున్నాడు.

తమిళ సూపర్ హిట్ మూవీ వేదలంకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ సరసన సయేషా సైగల్ హీరోయిన్ గా నటించనుందట. స‌యేషా వ‌య‌స్సు 19 సంవ‌త్స‌రాలు. ఆమె అక్కినేని న‌వ మ‌న్మ‌థుడు అఖిల్ డెబ్యూ మూవీ అఖిల్ సినిమాలో రొమాన్స్ చేసింది. స‌యేషా అల‌నాటి మేటి బాలీవుడ్ స్టార్ హీరో దిలీప్‌కుమార్‌, నాటి క్రేజీ హీరోయిన్ సైరాభాను దంప‌తుల ముద్దుల మ‌న‌వ‌రాలు. స‌యేషా పవన్ సినిమాలో అవకాశం రావటంతో తెగ సంబరపడిపోతుందట.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu