ఆంధ్రప్రదేశ్

జగన్ తో కలిసి పనిచేయడానికి నేను సిద్దం



పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో రోజుకో ముందడుగు వేస్తున్నారు. నిన్న ఆయన మీడియా మిత్రులతో మాట్లాడుతూ వారు అడిగిన ప్రతి ప్రశ్నకు చాలా ఓపికగా సమాధానం చెప్పారు. జనసేన పార్టీ స్పెషల్ ప్యాకేజి పై చాలా దృడమైన నిచ్చిత అభిప్రాయాన్ని ముందునుండే వ్యక్త పరుస్తూ వస్తోంది. గణతంత్ర దినోస్తవ సాక్షిగా ఆ అబిప్రాయం కాస్త అధినేత ఒక్క  పిలుపుతో  పోరాటరూపం దాల్చిoది. అది పెద్దగా చెప్పుకోదగ్గ స్థాయి లో హిట్ అవ్వకపొఇనా అధికార టిడిపి పార్టీ కి మాత్రం చాలా గట్టి సంకేతాలనే పంపింది. గణతంత్ర దినోస్తవం రోజున యువత చేపట్టిన నిరసనను టిడిపి ప్రబుత్వం ముందస్తు అరెస్టులు, సెక్షన్ 144 లాంటి ఆయుధాలతో అడ్డదారిలో నిరంకుశత్వం తో అణచివేసాయి.

అయితే ఆ తరువాత జరిగిన పరిణామాలు స్పెషల్ స్టేటస్ పై పెద్దగా ఎఫెక్ట్ చూపక పోయినా. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ స్పెషల్ ప్యాకేజి పై ఎవరు ముందుకు వచ్చినా అది ఏ రాజకీయ పార్టీ అయినా వారితో కలసి తప్పకుండా పని చేస్తామని చెప్పారు. అయితే విలేకరి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం గా జగన్ పార్టీ తో కూడా కలిసి పనిచేస్తాం అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు.

మీరు అప్పుడు బిజెపి కి అనుకూలం గా ప్రచారం చేసారు వారికి వోట్లు వేయాలని మీరు ప్రజలను కోరారు ఇప్పుడేమో అదే బిజెపి ని మీరు ఎందుకు విమర్శిస్తున్నారు అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. కావాలి అంటే మీరు రికార్డ్స్ చెక్ చేసుకోండి ఆ రోజు ప్రచార సభలో నేను చెప్పాను ప్రజలకు ఓట్లు వేయమని, అదే ప్రజలకు అదే ప్రచారం లో మరొక మాట కూడా చెప్పాను. వీళ్ళు కాని మీకు చెప్పింది చేయకపోతే మళ్ళి మీతరపున నిలబడి వారిపై పోరాటం చేసేది కూడా నేనే అని వివరంగా చెప్పాను. ఇందులో మీకేమైనా డౌట్స్ ఉంటే మీ అందరి దగ్గర రికార్డ్స్ ఉంటాయి కదా చెక్ చేసుకోండి మికే ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పారు.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu