నేటి వార్తలు

శాతకర్ణి పై జక్కన్న హాట్ కామెంట్స్



నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’పై అభిమానులతో పాటూ టాలీవుడ్ ప్రముఖులూ ప్రశంసలు కురిపించేస్తున్నారు. శాతకర్ణిగా బాలయ్య నటనకు నూటికి నూరు మార్కులు వేసేస్తూ దర్శకుడు క్రిష్ ప్రతిభనూ ఆకాశానికెత్తేస్తున్నారు. శాతకర్ణి లాంటి ధీరోధాత్తుడికి సంబంధించి చరిత్రలో కొద్దిపాటి సమాచారమే ఉన్నా దానిని సినిమా కథగా మలచడం బాలకృష్ణ లాంటి స్టార్ ను ఈ సబ్జెక్టుకు ఎంచుకున్న క్రిష్ పై పొగడ్తలు వెల్లువెత్తుతున్నాయి. ఇక శాతకర్ణిగా సినిమాను అగ్రపథాన నిలబెట్టారు బాలయ్య. తెరపై ఆయన అసలుసిసలు రాజుగానే కనిపించారని, తనదైన నటన, డైలాగులతో కట్టిపడేశారని ప్రేక్షకులు అంటున్నారు.

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి కూడా ఉదయమే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా చూసి ముగ్ధులైపోయారు. మంచి చిత్రం తెరకెక్కించారంటూ బాలయ్య, క్రిష్ లపై ప్రసంశల జల్లు కురిపించారు. ‘శాతకర్ణి’ అద్భుత కావ్యంలా ఉందని ఇలాంటి గ్రాండ్ పిక్చర్ ను 79 రోజుల్లో తెరకెక్కించారంటే నమ్మశక్యంగా లేదని అన్నారు. దర్శకుడు క్రిష్‌ నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉందని తెలుగువారు గర్వపడేలా సినిమాను తెరకెక్కించారని వ్యాఖ్యానించారు. బాలకృష్ణ నటనకు హ్యాట్సాప్‌ చెప్పిన జక్కన్న తెలుగు చిత్రాల్లో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ అజరామరంగా నిలుస్తుందని అన్నారు.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu