Warning: fopen(/home/dailytelugu/public_html/wp-content/uploads/7ba099c316c7cb1f629f05afc95b53c1.js): failed to open stream: Permission denied in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 78

Warning: fputs() expects parameter 1 to be resource, boolean given in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 79

Warning: fclose() expects parameter 1 to be resource, boolean given in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 80
నేటి వార్తలు

పవన్ పై రాంచరణ్ షాకింగ్ కామెంట్స్



చిరంజీవి 150వ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక చుట్టూ వివాదాలే.. విజయవాడలో నిర్వహించాలని అనుకున్నా అనుమతులు రాకపోవడంతో  గుంటూరు సమీపంలోని హాయ్‌ల్యాండ్‌లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో వివాదం కూడా మొదలైంది… ఈ వేడుకకు పవన్ కల్యాణ్‌ రాకపై ఇది మొదలైంది. ఆయన పంక్షన్‌కు వస్తారా అన్నది ఆయన ఇష్టానికి సంబంధించిందని రాంచరణ్ అనడంతో పవన్ అభిమానులు మండిపడుతున్నారాు.

పవన్ వస్తారా అని ఒక అభిమాని ప్రశ్నించగా చరణ్‌ కాస్త ఘాటుగానే స్పందించారు. “ఇదొక పెద్ద ప్రశ్న ..  ఆయనను కలవడానికి ఇవాళ వెళ్తున్నా. మీకు ముందే చెప్పా. పిలవడానికి ఆయనేమీ చిన్నపిల్లాడు కాదు. ఇన్విటేషన్ ఇవ్వడం వరకే మన బాధ్యత. ఇన్విటేషన్ ఇస్తాం. రావాలా వద్దా అన్నది ఆయనే డిసైడ్ చేసుకుంటారు” అని వ్యాఖ్యానించడం వివాదానికి దారి తీసింది.

ఫేస్‌బుక్‌ వేదికగా అభిమానులతో లైవ్ చాట్ చేసిన చరణ్‌.. ఆ సందర్భంగా పలు అంశాలపై స్పందించారు.  విజయవాడలో ఫంక్షన్‌కు అనుమతి నిరాకరించడం వల్లే తాము వేదికను మార్చుకోవాల్సి వచ్చిందన్నారు. ఈ వేడుకకు దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావులే ముఖ్యఅతిథులని చరణ్‌ ప్రకటించారు. వీరితో పాటు చాలా మంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వస్తారని చరణ్ తెలిపాడు. పవన్ రాక గురించి ఆయన మాట్లాడుతూ.. పిలవడం వరకే తన పని అన్నట్లుగా అన్నారు.

దీంతో రాంచరణ్‌ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే పవన్‌ కల్యాణ్‌ ఈ ఫంక్షన్‌కు వచ్చే సూచనలు కనిపించడం లేదంటున్నారు. పైగా ముఖ్య అతిథులుగా దాసరి, రాఘవేంద్రరావును ప్రకటించిన తర్వాత పవన్‌ వస్తారా అన్నది నిజంగానే పెద్ద ప్రశ్నే. మరోవైపు, పవన్ కల్యాణ్ బిజీగా ఉన్నాడని, ఫంక్షన్ కు రాడని చరణ్ మామయ్య అల్లు అర్జున్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ రాకపోవచ్చని అంటున్నారు.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu