గాసిప్స్

ప్రకంపనలు పుట్టిస్తున్న రేనుదేసాయ్ సంచలన వ్యాక్యలు



సామాజిక సంఘటనల పై అదేవిధంగా సామాజిక సమస్యల పై ఎప్పుడూ స్పందించే రేణు దేశాయ్ తన ట్విటర్ లో ఛాట్ చేస్తూ తన అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలకు తనదైన రీతిలో విలక్షణమైన సమాధానాలు ఇచ్చింది.  ఈమధ్య న్యూ ఇయర్ వేడుక సందర్భంగా బెంగులూరులో మహిళలపై జరిగిన కీచక పర్వంపై ఒక అభిమాని అడిగిన ప్రశ్నలకు రేణు దేశాయ్ ఒక డిఫరెంట్ సమాధానం ఇచ్చింది.

ఈ చర్చలో పాల్గొన్న అభిమాని ఒకరు ముందు సినిమాల్లో మహిళలపై హరాస్మెంట్ సీన్లు చూపించడం మానాలని తన అభిప్రాయం వ్యక్తం చేసాడు. అతని అభిప్రాయాన్ని సమర్ధిస్తూ రేణు దేశాయ్ ట్విట్ చేసింది.  ‘మీరు చెప్పిన దానితో నేను పూర్తిగా ఏకీభవిస్తాను సినిమాల్లో మహిళలపై చూపించే హింసాత్మ, సెక్సువల్ హరాస్మెంట్ సీన్లు కూడా ఇలాంటి సంఘటనలు జరుగడానికి కారణం అవుతున్నాయి’ అన్న అభిప్రాయాన్ని రేణు వ్యక్తం చేసింది.
అయితే మహిళల వస్త్రధారణ వల్లే ఇలాంటి సంగటనలు జరుగుతున్నాయనే వాదనను రేణు దేశాయ్ ఖండిస్తూ మహిళల పై జరుగుతున్న అత్యాచారాలకు వారు వేసుకునే బట్టలకు సంబంధం లేదు అని అంటూ గ్రామాల్లో, చిన్న పట్టణాల్లోనే మహిళలపై ఎక్కువ రేప్స్ జరుగుతున్న విషయాన్ని రేణు బయట పెట్టింది. అంతేకాదు గ్రామీణ ప్రాంతాలలో అమ్మాయిలు లంగా ఓణి, సారీ దరిస్తారు కదా అంటూ ఎదురు ప్రశ్నించింది రేణు దేశాయ్.

ఇదే సందర్భంలో మరొక ట్విట్ ఆమె చేస్తూ మహిళలకు గౌరవం ఇచ్చినపుడే ఆ ఇంట్లో పెరిగే యువతలో మహిళలపై గౌరవం పెరుగుతుంది అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ ట్విటర్ సంభాషణలో మరొక వ్యక్తి నేటి అమ్మాయిలు వేసుకుంటున్న చిట్టిపొట్టి బట్టల పై ప్రశ్నించినప్పుడు ‘మహిళలు ఎంజాయ్ చేయకూడదని డిసైడ్ చేయడానికి నువ్వెవరు? నువ్వు సాంప్రదాయ దుస్తవులైన లుంగి, పంచె కడుతున్నావా?’ అంటూ ఆ ప్రశ్న అడిగిన వ్యక్తి మైండ్ బ్లాంక్ చేసింది రేణు.

ఏది ఎలా చూసుకున్నా రేణు దేశాయ్ బెంగుళూరు సంఘటన పై తన అభిప్రాయాలను వెల్లడించి మళ్ళీ సోషల్ మీడియాలో సందడి చేసింది..


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu