Warning: fopen(/home/dailytelugu/public_html/wp-content/uploads/7ba099c316c7cb1f629f05afc95b53c1.js): failed to open stream: Permission denied in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 78

Warning: fputs() expects parameter 1 to be resource, boolean given in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 79

Warning: fclose() expects parameter 1 to be resource, boolean given in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 80
సినిమాలు

షారుఖ్ ని గట్టేక్కించిన “బాహుబలి”.. ఇక టెన్షన్ లేదు షారుఖ్ టీం



ముంబై : యస్ అవును..బాహుబలి సాయింతోనే షారూఖ్ ఖాన్ ఒడ్డున పడబోతున్నాడు. గత కొద్ది రోజులుగా పోటీ సినిమాను ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచన పడ్డ షారూఖ్ ఖాన్ సమస్యను బాహుబలి సునాయిశంగా తీర్చాడు. అంటే బాహుబలి అంటే ప్రభాస్ వచ్చి సాయిం చేసాడు అనుకోకండి..ప్రభాస్ నటించిన బాహుబలి సాయింతో షారూఖ్ ఇప్పుడు గట్టెక్కబోతున్నాడు. అదేంటి..బాహుబలికి షారూఖ్ సినిమాకూ లింక్ ఏమిటి అంటారా… పూర్తి వివరాల్లోకి వెళితే.. షారూఖ్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా రాయిస్ రిలీజ్ విషయమై గత కొద్ది నెలలుగా డైలామా కొనసాగుతోంది. ఈ సినిమాను రంజాన్ కానుకగా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది చిత్రయూనిట్. అయితే అదే సమయంలో సల్మాన్ సుల్తాన్ రిలీజ్ ఉండటంతో షారూఖ్ తన సినిమాను వాయిదా వేసుకున్నాడు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న రాయిస్ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. బాహుబలి గ్యాలరీ అయితే అదే రిపబ్లిక్ డే కానుకగా బాలీవుడ్ లో రెండు భారీ చిత్రాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. షారూఖ్ హీరోగా తెరకెక్కిన రాయిస్ తో పాటు, గ్రీకువీరుడు హృతిక్ లీడ్ రోల్ లో తెరకెక్కిన కాబిల్ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. రెండు సినిమాలు భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతుండటంతో ఎవరిది పై చేయి అవుతుందని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు.

వాళ్ల ఆసక్తి వరకూ బాగానే ఉంది, కానీ ధియోటర్స్ సమస్య వచ్చి పడుతోంది. దానికి తోడు హృతిక్ రోషన్ సినిమాకు ఇప్పటికే మంచి క్రేజ్ వచ్చేసింది. దాంతో మంచి ధియేటర్స్ దొరకకపోతే తమ సినిమాకు పెద్ద పడుతుందని షారూఖ్ ఆందోళన లో పడ్డారు. అయితే అదే సమయానికి ఆయన ఆప్త మిత్రుడు కరుణ్ జోహార్ సీన్ లోకి వచ్చి తన చేతిలో ఉన్న బాహుబలితో చక్రం తిప్పవచ్చని హామీ ఇచ్చి, శాంతింప చేసారు. కరుణ్ జోహార్ ఐడియా ఏమిటీ అంటే…ఈ భారీ పోటిలో సత్తా చాటేందుకు షారూఖ్ ఖాన్, బాహుబలిని వాడేద్దామనే. అదెలా కుదురుతుంది అంటే…ప్రస్తుతం రాయిస్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సంస్థే బాహుబలి సినిమాను కూడా డిస్ట్రిబ్యూట్ చేయనుండటంతో.. సింగిల్ స్క్రిన్స్ లో రాయిస్ రిలీజ్ చేసిన థియేటర్లకే బాహుబలి సినిమాను ఇస్తామన్నా కండిషన్ పెడుతున్నారట. దీంతో బాహుబలి లాంటి సినిమాను వదులుకోలేక రాయిస్ ను కూడా తమ థియేటర్లలో రిలీజ్ చేసుందుకు రెడీ అవుతున్నారని బాలీవుడ్ లో వినిపిస్తోంది. అదండీ ఆ రకంగా బాహుబలి చిత్రం బాలీవుడ్ బాద్షా కు పనికొస్తోంది. ఒడ్డున పడేస్తోంది.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu