నేటి వార్తలు

జగన్ వెనకే నేను అంటున్న శశికళ



త్వరలోనే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టబోతున్న దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ… ఎప్పటికైనా తమిళనాడు ముఖ్యమంత్రి అవుతారని తమిళనాట రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అమ్మకు అంతిమ సంస్కారాలు కూడా నిర్వహించిన జయలలిత… తమిళనాడు సీఎం పీఠంపై చాలాకాలం క్రితమే కన్నేశారని ఓ అంగ్ల పత్రిక జర్నలిస్టు కుమి కపూర్ రాసిన కలామ్ తో స్పష్టమైంది. రెండు నెలలకు పైగా జయలలిత ఆస్పత్రిలో అంపశయ్యపై ఉన్నప్పుడే తాను సీఎం అయ్యేందుకు శశికళ పావులు కదిపారని కుమి కపూర్ తన కాలమ్ లో వెల్లడించారు. అన్నాడీఎంకేలో ఉన్న తన అనుచరులతో రాయబరం నడిపించి… ఎమ్మెల్యేలతో తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకునేందుకు శశికళ ప్రయత్నాలు చేశారట.

అయితే ఇందుకు కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు, నాయకులు ససేమిరా అనడంతో ఆమె తన ప్రయత్నాలను విరమించుకున్నట్టు సమాచారం. శశికళ గేమ్ ప్లాన్ చూస్తుంటే… ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి మరణించినప్పుడు వైసీపీ అధినేత జగన్ నడిపించిన వ్యవహారం గుర్తుకు రాకమానదు. అయితే అప్పట్లో జగన్ విఫలమైనట్టే… శశికళ కూడా తన ప్రయత్నంలో ఫెయిలయ్యారని తెలుస్తోంది. అయితే రాబోయే మూడు నాలుగేళ్లలో ఎప్పటికైనా ఆమె పన్నీరు సెల్వంను తప్పించి సీఎం సీటును దక్కించుకోవడానికి పావులు కదిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఈ విషయం ఇలా ఉంటె జగన్ తో పోతుపై ఆమె తీవ్రమైన ఆలోచనా చేస్తున్నట్లు సమాచారం. దానికి జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu