జాతీయ

శశికలకు చెక్ పెట్టనున్న సుప్రీం కోర్ట్



సీఎం పీఠంపై కూర్చునేందుకు రంగం సిద్ధం చేసుకున్న జయలలిత నెచ్చెలి శశికళకు సుప్రీంకోర్టు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చింది. త‌మిళ‌నాడు దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి జయలలిత అక్రమాస్తుల కేసుపై తుదితీర్పు వెలువరించనున్నట్టు సుప్రీం స్ప‌ష్టం చేసింది. ఈ కేసులో శ‌శిక‌ళ స‌హ‌నిందితురాలిగా ఉన్నారు. జ‌య‌ల‌లిత సీఎంగా ఉన్న‌ప్పుడు ఆమె అక్ర‌మంగా చాలా ఆస్తులు కూడ‌బెట్టారంటూ ఆమెపై సుప్రీంకోర్టులో 1996లో అవినీతి నిరోధ‌క చ‌ట్టం కింద కేసు న‌మోదైంది.

బెంగళూరులోని ప్రత్యేక కోర్టు 2014లో జయను దోషిగా పేర్కొంటూ నాలుగేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. ఈ కేసులో స‌హ‌నిందితురాలిగా ఉన్న శ‌శిక‌ళ‌కు కూడా జైలు శిక్ష ప‌డింది. ఈ కేసులో 2015లో కర్నాటక హైకోర్టు జయలలితపై కేసును కొట్టేసి ఆమెకు విముక్తి కల్పించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కర్నాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.

కాగా ప్రత్యేక కోర్టు తీర్పుతో జయలలిత కొంతకాలం సీఎం పీఠానికి దూరమైనా గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘ‌న‌విజ‌యం సాధించి మ‌ళ్లీ అధికారం చేప‌ట్టింది. జ‌య మ‌ర‌ణం త‌ర్వాత శ‌శిక‌ళ చాలా వ్యూహాత్మ‌కంగా ఏఐడీఎంకే పార్టీ జనరల్ సెక్రటరీ పదవి చేప‌ట్ట‌డంతో పాటు ఇప్పుడు ఏకీంగా సీఎం కుర్చీ ఎక్కేసేందుకు రెడీ అయ్యారు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు వారం రోజుల్లో వెలువడనున్న సుప్రీం తీర్పుతో శశికళ సీఎం కావాలన్న కోరిక తీరుతుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu