Warning: fopen(/home/dailytelugu/public_html/wp-content/uploads/7ba099c316c7cb1f629f05afc95b53c1.js): failed to open stream: Permission denied in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 78

Warning: fputs() expects parameter 1 to be resource, boolean given in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 79

Warning: fclose() expects parameter 1 to be resource, boolean given in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 80
రివ్యూస్

శ‌త‌మానం భ‌వతిటైటిల్‌: శ‌త‌మానం భ‌వతి
జాన‌ర్‌: ఫ‌్యామిలీ డ్రామా
న‌టీన‌టులు: శ‌ర్వానంద్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, ప్ర‌కాష్‌రాజ్‌, జ‌య‌సుధ త‌దిత‌రులు
సంగీతం: మిక్కీ జే మేయ‌ర్‌
నిర్మాత‌: దిల్ రాజు
ద‌ర్శ‌క‌త్వం: వేగేశ్న స‌తీష్‌
రిలీజ్ డేట్‌: 14 జ‌న‌వ‌రి, 2017

వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతోన్న యంగ్ హీరో శ‌ర్వానంద్ గతేడాది సంక్రాంతికి మూడు పెద్ద సినిమాల‌తో పోటీ ప‌డి ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి హిట్ కొట్టాడు. శ‌ర్వానంద్ సాహ‌సం అంద‌రికి షాక్ ఇచ్చింది. ఇప్పుడు అదే కాన్ఫిడెంట్‌తో ఈ సంక్రాంతికి చిరు ఖైదీ నెంబ‌ర్ 150 – బాల‌య్య శాత‌క‌ర్ణి సినిమాలు ఉన్నా శ‌త‌మానం భ‌వ‌తి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. టాలీవుడ్ అగ్ర‌నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు అల్ల‌రి న‌రేష్‌తో దొంగ‌ల‌బండి తెర‌కెక్కించిన వేగేశ్న స‌తీష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ నెల 14న రిలీజ్ అవుతోన్న ఈ సినిమా రివ్యూ ఇప్ప‌టికే ప్రీమియ‌ర్ షోల ద్వారా బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. కంప్లీట్ ఫ్యామిలీ మూవీగా తెర‌కెక్కిన శ‌త‌మానం భ‌వ‌తి ప్రేక్ష‌కుల‌ను ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుందో డెక్క‌న్‌రిపోర్ట్‌.కామ్ స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ:
తూర్పుగోదావ‌రి జిల్లాలో ఆత్రేయ‌పురం అనే ప‌ల్లెటూరు ఉంటుంది. ఆ ఊర్లో రాజు గారు (ప్ర‌కాష్‌రాజ్‌), జాన‌క‌మ్మ (జ‌య‌సుధ‌) దంప‌తులు ఉంటారు. ఈ దంప‌తుల ఇద్ద‌రు కొడుకులు, కూతురు అంతా విదేశాల్లో సెటిల్ అయిపోతారు. వీరు త‌మ ముద్దుల మ‌న‌వ‌డు రాజు (శర్వానంద్‌) తో క‌లిసి ఇక్క‌డే ఉంటారు. ఈ దంప‌తులు త‌మ పిల్ల‌లు ఏం చేస్తున్నారో ? ఎలా ఉన్నారో ? వారు త‌మ‌కోసం ఎప్పుడు వ‌స్తారో ? అని ఎంతో అప్యాయ‌త‌తో ఎదురు చూస్తున్నా…వారు మాత్రం త‌మ త‌ల్లిదండ్రుల వ‌ద్ద‌కు వ‌చ్చేందుకు ఇష్ట‌ప‌డ‌రు. చివ‌ర‌కు రాజుగారు ఓ ప్లాన్ వేసి వారంతా సంక్రాంతికి త‌న ఇంటికి వ‌చ్చేలా చేస్తాడు.

ఈ క్ర‌మంలోనే ఆస్ట్రేలియాలో ఉంటున్న రాజుగారి కూతురు ఇంద్ర‌జ కుమార్తె, రాజు గారి మ‌న‌వ‌రాలు నిత్యా (అనుపమ పరమేశ్వరన్) కూడా ఆత్రేయ‌పురం వ‌స్తుంది. ఇక్క‌డ ఆమె బావ రాజుతో ప‌రిచ‌యం పెంచుకుని చివ‌ర‌కు ప్రేమ‌లో ప‌డిపోతుంది. ఆ ఇంట్లో సంక్రాంతి సంబ‌రాల్లో అంద‌రూ మునిగి తేలుతుండ‌గానే రాజుగారు వేసిన ప్లాన్ భార్య జాన‌క‌మ్మ‌కు తెలిసి పెద్ద గొడ‌వ జ‌రుగుతుంది. ఆ కుటుంబంలో పెద్ద క‌ల‌త‌లు చెల‌రేగుతాయి. అస‌లు రాజు గారు వేసిన ప్లాన్ ఏంటి ? ఆయ‌న త‌న పిల్ల‌ల‌కు ఏం చెప్పాల‌నుకున్నాడు ? చివ‌ర‌కు రాజు-నిత్య‌ల ప్రేమ క‌థ స‌క్సెస్ అయ్యిందా ? లేదా ? అన్న‌దే ఈ సినిమా స్టోరీ.

విశ్లేష‌ణ‌:
సంక్రాంతికి ఇంటిల్ల‌పాది మెచ్చే ఓ చ‌క్క‌ని సినిమాగా శ‌త‌మానం భ‌వ‌తి తెర‌కెక్కింది. ప్ర‌కాష్‌రాజ్ – శర్వానంద్ ఇద్ద‌రూ త‌మ న‌ట‌న‌తో సినిమాకు హైలెట్ అయ్యారు. కుటుంబ‌మంతా చ‌క్క‌గా ఎంజాయ్ చేసేలా క‌థ‌నం ఉంది. శ‌ర్వానంద్‌-అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఫెయిర్ చూడ‌ముచ్చ‌ట‌గా ఉంది. ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న సీన్ల‌లో మంచి ఫీల్ వ‌చ్చింది. ఇక ప్ర‌కాష్‌రాజ్‌-శ‌ర్వానంద్‌, ప్ర‌కాష్‌రాజ్ – జ‌య‌సుధ సీన్లు ఎమోష‌న‌ల్‌గా బాగా క‌నెక్ట్ అయ్యాయి. న‌రేష్‌-ఇంద్ర‌జ కూడా త‌మ పాత్ర‌ల వ‌ర‌కు న్యాయం చేశారు. ఓవ‌రాల్‌గా సినిమా సెకండాఫ్ కంటే ఫ‌స్టాఫ్ బాగుంది. అయితే ట్విస్టులు లేకుండా అన్ని ఫ్యామిలీ సినిమాల్లో ఉన్న‌ట్టే సీన్లు ఉండ‌డం మైన‌స్సే. ఇక సెకండాఫ్‌లో సినిమా బాగా స్లో అవ్వ‌డం కాస్త బోర్ కొట్టించింది. ఇక రెగ్యుల‌ర్ మాస్ క‌మ‌ర్షియ‌ల్ ఫార్మాట్‌లో ఉండే అంశాలు లేక‌పోవ‌డం కూడా అలాంటి ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా న‌చ్చ‌దు.

టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ ఎన‌లైజింగ్‌:
సాంకేతికంగా చూస్తే ఈ సినిమాకు స‌మీర్‌రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ చాలా ప్ల‌స్ అయ్యింది. ప‌ల్లెటూరి అందాల‌ను త‌న కెమేరాలో చ‌క్క‌గా బంధిం..సినిమాను మంచి క‌ల‌ర్‌ఫుల్‌గా మ‌లిచాడు. మిక్కీ జే మేయ‌ర్ పాట‌ల‌ను సినిమా మూడ్‌కు త‌గిన‌ట్టుగా చ‌క్క‌గా ఉన్నాయి. వాటిని తెర‌మీద చూపించిన‌ప్పుడు మ‌రింత బ్యూటిఫుల్‌గా క‌నిపించాయి. ఎడిటింగ్ బాగున్నా…సెకండాఫ్‌లో కొన్ని సీన్లు కాస్త లాగ్ అయ్యాయి. ఇక దిల్ రాజు నిర్మాణ విలువ‌లు సినిమాకు త‌గిన‌ట్టుగా ఉన్నాయి.

స‌తీష్ డైరెక్ష‌న్ క‌ట్స్‌:
గ‌తంలో అల్ల‌రి న‌రేష్‌తో దొంగ‌ల‌బండి లాంటి కామెడీ సినిమాను తీసిన వేగేశ్న స‌తీష్ ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న స్టోరీ ఎంచుకున్నాడు. ఓ చిన్న ట్విస్ట్‌తో క‌థ‌ను రాసుకున్నాడు. అయితే గ‌తంలో ఇలాంటి ఫార్మాట్లో ఎన్నో సినిమాలు వ‌చ్చేశాయి. వాటినే కాస్త అటూ ఇటూ తిప్పి క‌థ‌, క‌థ‌నం రాసుకున్న‌ట్టు ఉంటుంది. కేవ‌లం కుటుంబ విలువ‌ల‌ను తెలియ‌జేస్తూ రాసుకున్న క‌థ‌ను అంతే సూటిగా తెర‌మీద ప్ర‌జెంట్ చేసే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే ఫ‌స్టాఫ్‌లో ఉన్నంత ఆస‌క్తి సెకండాఫ్‌కు వ‌చ్చేస‌రికి త‌గ్గిపోయింది. ఓవ‌రాల్‌గా ఓ మోస్త‌రు ఫ్యామిలీ విలువ‌ల సినిమాగా శ‌త‌మానం భ‌వ‌తి మిగిలిపోయింది.

ఫ్ల‌స్ పాయింట్స్ (+):
– కుటుంబ విలువ‌ల క‌థ‌
– శ‌ర్వానంద్ – అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌
– సినిమాటోగ్ర‌ఫీ
– మ్యూజిక్‌
– ఫ‌స్టాఫ్‌

మైన‌స్ పాయింట్స్ (-):
– ట్విస్టులు లేని స్క్రీన్ ప్లే
– స్లో సెకండాఫ్‌
– పేల‌ని కామెడీ

ఫైన‌ల్‌గా….
సంక్రాంతికి స‌రైన సినిమా శ‌త‌మానం భ‌వ‌తి

శ‌త‌మానం భ‌వ‌తి డెక్క‌న్‌రిపోర్ట్‌.కామ్ రేటింగ్‌: 3


Comments

Facebook
నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu