గాసిప్స్

రోజు రోజు కి ప్రియుడితో హద్దులు దాటుతున్న శ్రీదేవి కూతురు.. శ్రీదేవి ఎం చేసిందో తెలుసా ??ముంబై : మాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలిరా అని యక్త వయస్సులోకి వచ్చిన మగపిల్లలు పాటలు పాడుకుంటున్నట్లుగానే ఆడపిల్లలు కూడా మేం వయస్సుకు వచ్చాం…మాకొక బోయ్ ఫ్రెండ్ కావాలి అంటూండటం సహజం. దానికి తోడు సెలబ్రెటీ పిల్లలు ..బోయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేయటం పేజ్ త్రి సర్కిల్స్ లో స్టేటస్ సింబల్ గా మారింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే…తెరపై ఎన్నో ప్రేమ కథలను చూసి, నటించి, తన నిజ జీవితంలోనూ ప్రేమ వివాహం చేసుకున్న శ్రీదేవి ఇప్పుడు తన పెద్ద కుమార్తె ప్రేమ వ్యవహారంపై మండిపడుతోంది. ముఖ్యంగా తన కుమార్తె డేటింగ్ వ్యవహారం మీడియాకు ఎక్కటం అసలు నచ్చటంలేదని బాలీవుడ్ మీడియా అంటోంది. రీసెంట్ గా శ్రీదేవి కూతురు జాన్వి వార్తల్లో నిలిచింది. జాన్వి తన బాయ్‌ఫ్రెండ్‌ శిఖర్‌ పహరియాను ముద్దుపెట్టుకోవడం, వీరిద్దరు లిప్‌ టు లిప్‌ కిస్‌ చేసుకున్న ఫొటోలు వైరల్‌ అయ్యాయి. ఈ విషయమై శ్రీదేవి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిందనే విషయం బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యి కూర్చుంది.

గౌరవానికి తక్కువ లేదు: వాస్తవానికి శ్రీదేవి, బోనీ కపూర్‌ దంపతుల పిల్లలు జాన్వి కపూర్‌, ఖుషీ కపూర్‌కు స్టార్‌ కిడ్స్‌గా హిందీ సినీ పరిశ్రమలో చాలామంచి పేరుంది. దానికి తోడు తండ్రి పెద్ద నిర్మాత, తల్లి ఇప్పటికీ నటిస్తున్న నటి కావటంతో వీరు ఎక్కడికి వెళ్లినా అంతా గౌరవిస్తూంటారు.

సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నారు: దానికి తోడు టీనేజ్ లోకి ఎంటరైన యుక్తవయస్సుకు వస్తున్న ఈ ఇద్దరు అమ్మాయిలు సోషల్‌ మీడియాలో ఫొటోలు పెడుతూ , ఎప్పటికప్పుడు తమ అప్ డేట్స్ ఇస్తూ అభిమానులను పోగు చేసుకోవటం కూడా ముచ్చట గొలిపే అంశమే. అయితే అవన్నీ వేరు, బోయ్ ఫ్రెండ్ తో డేటింగ్ వ్యవహారం వేరుకదా.

ఆ లిప్ లాక్ కిస్ పెట్టినోడు ఎవరంటే.. ఇంతకీ శ్రీదేవి కుమార్తె తో డేటింగ్ చేస్తూ …అంతలా పబ్లిక్ గా లిప్ టు లిప్ కిస్ పెట్టుకున్న కుర్రాడు ఎవరూ అంటే… ప్రముఖ రాజకీయ నాయకుడు సుశీల్‌కుమార్‌ షిండే మనవడు అయిన శిఖర్‌తో తన కూతురు డేటింగ్‌ చేయడం శ్రీదేవికి ఏమాత్రం నచ్చడం లేదట.

రూల్స్ పెట్టిన శ్రీదేవి: జాన్వి, శిఖర్‌ ముద్దుపెట్టుకున్న ఫొటోలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న శ్రీదేవి.. కూతురికి కొన్ని కఠినమైన రూల్స్ విధించిందని ముంబై మిర్రర్‌ పత్రిక ఓ కథనంలో తెలిపింది. కెరీర్ మొదలెట్టాల్సిన సమయంలో ఇలాంటివన్నీ పెట్టుకోవద్దని వార్నింగ్ ఇచ్చిందని చెప్తున్నారు.
తన కెరీర్ లాగే.. ఒక్కప్పటి అందాల హీరోయిన్ గా, జగదేక సుందరిగా రాణించిన శ్రీదేవి సినీ పరిశ్రమలో ప్రవేశించిన కొత్తలో ప్రతిదానికి తల్లి సలహా ఆధారంగా నడుచుకుంది. ఇప్పుడు తన కూతురి విషయంలోనూ అదే సంప్రదాయం కొనసాగాలని ఆమె తాపత్రయపడుతున్నట్టు సన్నిహితులు చెప్తున్నారు.

ఇవన్నీ కామన్: శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఇంకా సినిమా రంగంలోకి అడుగు పెట్టక పోయినా….సెలబ్రిటీ స్టేటస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న నేపథ్యంలో మీడియా ఆమె ఎక్కడ కనిపించినా అత్యుత్సాహం చూపిస్తోంది. ఈ కాలం పిల్లల్లో ఇవన్నీ కామన్ అని శ్రేదివికు ఆమె సన్నిహితులు సలహా ఇస్తున్నారట.

ఈ ఏజ్ లోనే ఇంతలా: ఈ వయసులోనే జాన్వి కపూర్ ఈ రేంజిలో రెచ్చిపోతోందంటే… రేపు బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాక ఆమె ఇంకెలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందో? అని మరికొందరు అంటున్నారు. ఎఫైర్స్ లేని బాలీవుడ్ ని ఊహించగలమా…ఇలాంటి విషయాల్లో జాన్వి చూస్తూంటే పిహెచ్ డినే చేసేటట్లు ఉందే అని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

బోయ్ ఫ్రెండ్ తక్కవవాడేమీ కాదు: జాహ్నవి కపూర్ మెయింటైన్ చేస్తున్న బోయ్ ఫ్రెండ్…తక్కువవాడు కాదు. ముంబై ధీరూభాయ్ అంబాని ఇంటర్నేషనల్ , బోంబే స్కాటిష్ స్కూల్ లో స్కూలింగ్ పూర్తి చేసారు. ఆ తర్వాత లండన్ లో రెగెంట్ యూనివర్సిటీలో గ్రాడ్యువేషన్ పూర్తి చేసారు. ప్రస్తుతం ముంబైలో ఉంటున్నాడు.


Comments

Facebook
నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu